ETV Bharat / state

గుండెపోటుతో బస్సులోనే ప్రాణం పోయింది..

author img

By

Published : Jun 11, 2020, 2:22 PM IST

హైదరాబాద్​కు వెళ్దామని బయలుదేరిన ఓ వ్యక్తి గమ్యం చేరుకోకుండానే ప్రాణాలు వదిలిన ఘటన ఉమ్మడి వరంగల్​ జిల్లాలో చోటు చేసుకుంది. టికెట్​ తీసుకుని బస్సు ఎక్కిన వ్యక్తికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

man-died-with-heart-attack-in-rtc-bus-at-hanmakonda
గుండెపోటుతో బస్సులోనే ప్రాణాలు వదిలిన వ్యక్తి

ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో హైదరాబాద్​కి వెళ్తున్న షేక్ ముత్తూట్ అలీ గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు పరకాల వద్ద బస్సు ఎక్కి హైదరాబాద్​కు టికెట్​ తీసుకున్నాడు. హన్మకొండ దాటగానే ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పగానే 108 సిబ్బందికి, పోలీసులకు కండక్టర్​ సమ్మయ్య సమాచారం ఇచ్చారు.

బస్సు స్టేషన్​ ఘనపూర్​కి చేరుకోగానే 108 వాహనం సిద్ధంగా ఉందని... బస్సు వద్దకు వచ్చి సిబ్బంది పరిశీలించగా అప్పటికే మృతి చెందాడని తెలిపారు. బంధువులకు సమాచారం అందించి... మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: 'ఎన్ని సమస్యలొచ్చినా.. ధైర్యంగా ముందుకు సాగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.