Cheruvu land grab: కబ్జారాయుళ్లకు స్వర్గధామంగా చెరువు.. కోట్ల రూపాయల విలువైన భూమి అన్యాక్రాంతం

author img

By

Published : May 14, 2022, 5:01 AM IST

Cheruvu land grab:

ఓరుగల్లును గతేడాది వరదలు ముంచెత్తినా అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. వచ్చేది వర్షాకాలం అయినా తగిన చర్యలు తీసుకుంటున్న పాపాన పోవట్లేదు. వరద నీరు పోయేందుకు సరైన నాలాలు లేకపోగా ఉన్న చెరువులను కబ్జా చేస్తున్నా పట్టించుకోవట్లేదు. హనుమకొండలోని గోపాల్‌పూర్ చెరువు కబ్జారాయుళ్లకు స్వర్గధామంగా మారింది.

హనుమకొండ 56వ డివిజన్‌లోని గోపాల్‌పూర్ చెరువు కబ్జాకు గురవుతోంది. కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం అవుతుంటే.. అధికారులు పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు....... నగరంలో భూగర్భ వరద కాలువ నిర్మాణం కోసం తవ్విన మట్టి, కంకర వ్యర్థాలను గోపాల్‌పూర్ చెరువులో నింపి.. సగానికిపైగా పూడ్చేయడంతో ఆక్రమణలకు సులువుగా మారింది. 70 ఏళ్ల కిందట సర్వే నెంబర్ 89లో 21.01 ఎకరాల భూమిలో.. చెరువును తవ్వినట్లు రెవెన్యూ రికార్డులో ఉంది. ఆ తటాకం కింద గోపాల్‌పూర్‌, భీమారం, కోమిటిపల్లి రైతులు పంటలు సాగు చేసేవారు. తాగునీటిఅవసరాలను తీర్చింది. నాలుగేళ్ల కిందట మిషన్‌ కాకతీయలో భాగంగా 5 లక్షలతో పూడికతీసి..... చెరువు కట్టను పటిష్టం చేసినా.. కాపాడేందుకు చర్యలు తీసుకోలేకపోయారు. నగర విస్తీర్ణలో భాగంగా ఆయకట్టు పొలాలు ప్లాట్లుగా మారాయి. శిఖం భూముల్లో కాలనీలు వెలిశాయి. ఇక్కడ భూమి విలువ ప్రస్తుతం గజానికి 30 వేలకు పైగా ఉండటంతో ఆక్రమణదారులు వీలైనంత భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం చెరువు తూములు కనుమరుగయ్యాయి.


ఆ చెరువు పరిధిలో గతంలోని పంచాయతీతో పాటు.. ప్రస్తుత కార్పొరేషన్ అధికారులు పుల్‌ట్యాంకు లెవల్‌ నిబంధనలు పాటించలేదు. చెరువు శిఖం ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని నిబంధనలు చెబుతున్నా కొందరు బడాబాబుల ఒత్తిడికి తలొగ్గి తలొగ్గి అనుమతులు జారీచేశారు. గతంలో 21 ఎకరాల విస్తీర్ణంలో ఉండే గోపాల్‌పూర్ చెరువు ప్రస్తుతం 10 ఎకరాలకు కుచించకుపోయింది.స్థానికులతో పాటు ప్రజాసంఘాలు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు వినతి పత్రాలు పట్టించుకున్నా దాఖలాలు లేవు.ఇప్పటికైనా అధికారులు కోట్ల విలువైన భూమిని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఫేస్​బుక్​ క్రైం కథలో కొత్త కోణం.. చంపొద్దని శ్వేతారెడ్డి మెస్సేజ్​.. కానీ..!!

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.