ఫేస్​బుక్​ క్రైం కథలో కొత్త కోణం.. చంపొద్దని శ్వేతారెడ్డి మెస్సేజ్​.. కానీ..!!

author img

By

Published : May 13, 2022, 10:02 PM IST

Updated : May 14, 2022, 12:14 PM IST

new angle in swetha reddy Facebook murder case

హైదరాబాద్‌లోని ప్రశాంత్‌హిల్స్‌లో ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో.. ప్రియుడిని హత్య చేయించిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి మొబైల్ ఫోన్లు పరిశీలించగా.. కొత్త అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది.


ప్రియుడిని చంపించిన వివాహిత కేసులో కొత్త కోణం బయటపడింది. మొదట ప్రియుడిని హత్య చేయించాలని పథకం పన్నిన శ్వేతారెడ్డి చివరి నిమిషంలో హత్యచేయవద్దని మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే సుత్తితో కొట్టడంతో... బాధితుడు కిందిపడిపోయాడు. తల వెనక కొడితే మతిస్థిమితం కోల్పోతాడనే దాడి చేశామంటూ నిందితులు పోలీసుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ ప్రశాంత్‌హిల్స్‌కు చెందిన.. శ్వేతారెడ్డికి 2015లోవివాహమైంది. బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న ఆమెకు.. నాలుగేళ్ల క్రితం బాగ్‌అంబర్‌పేట్‌కి చెందిన ఫొటోగ్రాఫర్‌ యశ్మకుమార్‌తో ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నెలక్రితం యశ్మకుమార్.. పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఇప్పటికే అత్యంత సన్నిహితంగా ఉంటున్నందున వివాహబంధంతో ఒక్కటవుదామని చెప్పాడు. యశ్మకుమార్ ప్రతిపాదనకు శ్వేతారెడ్డి నిరాకరించింది. బలవంతంగానైనా పెళ్లికి ఒప్పించాలని అనుకున్న యశ్మకుమార్‌...తన వద్ద ఫొటో, వీడియోలను బయటపెడతామని హెచ్చరించడంతో అతడిని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేసింది.

ఆ సమయంలో ఎన్టీఆర్​ జిల్లా తిరువూరుకు చెందిన అశోక్‌తోనూ.. శ్వేతారెడ్డి వివాహేతర సంబంధం కొనసాగించింది. యశ్మకుమార్ పెళ్లి కోసం ఒత్తిడిచేస్తుండటంతో.. అశోక్‌తో కలిసి చంపాలని ప్రణాళిక వేసింది. శ్వేతారెడ్డి పథకం ప్రకారం అశోక్ తన మిత్రుడు కార్తీక్‌తో కలిసి.. ఈనెల 4న నగరానికి వచ్చాడు. యశ్మకుమార్‌కు ఫోన్‌ చేసిన శ్వేతారెడ్డి ప్రశాంత్‌హిల్స్‌ రావాలని సూచించింది. అక్కడకు చేరుకున్న అశోక్‌, కార్తీక్‌ వెంటతెచ్చుకున్న సుత్తితో తలపై మూడుసార్లు బలంగా కొట్టగా.. యశ్మకుమార్‌ అక్కడికక్కడే పడిపోయాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిన అశోక్‌...వెంటనే తిరిగొచ్చి యశ్మకుమార్‌ ఫోన్ కోసం వెతికినా దొరకలేదు.అందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు.

యశ్మకుమార్‌ హత్యకు పథకం వేసిన శ్వేతారెడ్డి.. చివరి నిమిషంలో హత్య చేయొద్దని అశోక్‌కు మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే సుత్తితో కొట్టడంతో ఆ యువకుడు కిందిపడిపోయాడు. తల వెనక కొడితే మతిస్థిమితం కోల్పోతాడనే దాడి చేశామంటూ నిందితులు పోలీసుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

Last Updated :May 14, 2022, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.