ETV Bharat / state

"కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం"

author img

By

Published : Apr 3, 2023, 3:32 PM IST

Updated : Apr 3, 2023, 3:58 PM IST

Kisan Congress
కిసాన్​ కాంగ్రెస్​

Kisan Congress leaders criticized KCR: ఇటీవలే వచ్చిన వడగండ్ల వర్షాలకి వరంగల్​ జిల్లాలో నష్టపోయిన పంటలకి ప్రభుత్వం పరిహారం రూ.10వేలు ప్రకటించింది. దీనిపై కిసాన్​ కాంగ్రెస్​ స్పందించి ఆ నగదు దేనికి సరిపోదని కనీసం రూ.15 వేలు ఇస్తే కొంచెం ఉపశమనం వస్తుందని డిమాండ్​ చేసింది. అలానే కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని కోదండ రెడ్డి తెలిపారు.

Kisan Congress leaders criticized KCR: ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో వడగండ్ల వానకు జరిగిన పంట నష్టానికి పరిహారం ఇస్తాం అని చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నామని కిసాన్ కాంగ్రెస్ తెలిపింది. కానీ మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో నష్టపోయిన దానికి రూ.10 వేలు ఇస్తే పెట్టుబడి పెట్టిన డబ్బలకు సరి తూగట్లేదని విమర్శించింది. కనీసం రూ.15 వేలు ఇస్తే కొంత ఊరట ఉంటుందని చెప్పింది. పండ్లు, కూరగాయ తోటలకు ఎంత ఇస్తారో చెప్పలేదని గుర్తు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో జిల్లాలోని మిర్చి పంటతో సహా మిగతా పంటలు నష్టపోయాయని చెప్పింది. ఇప్పుడు మిర్చీకి కేవలం ఎకరానికి రూ.5400, మొక్కజొన్న పంటకు రూ.330 ఇస్తున్నారని వివరించింది. అది కూడా కొద్దీ మంది రైతులకు ఇచ్చి మిగిలిన రైతులకు ఇవ్వలేదని పేర్కొంది. ఇలాంటి ఆర్థిక సహాయం రైతులకు ఎలా ఊరటని ఇస్తుందని ప్రశ్నించింది.

గోదావరి పరివాహిక ప్రాంతం కోతకు గురైనప్పుడు ఎందుకు మాట్లాడలేదు: కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం ఆరోపణలు చేసుకుంటూ రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించింది. గత సంవత్సరం జులైలో గోదావరి పరివాహిక ప్రాంతంలో అకాల వర్షాలు పడి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టంతో పాటు.. సాగు భూములు కోతకు గురై ఇసుక మేటలు పెడితే వాటి గురించి కేసీఆర్ ఒక్క మాట కూడా చెప్పకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించింది. దీని మీద పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వ బృందానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కిసాన్ కాంగ్రెస్ ఇచ్చింది.

కడెం ప్రాజెక్ట్ విషయంలో పరిహారం విషయం ఎందుకు మాట్లాడలేదు: గతంలో పంటల బీమా పథకంతో రాష్ట్ర వాటా కట్టలేనందున అన్నదాతలు ఆ పథకానికి దూరమైతే కేసీఆర్​ ఒక్క మాట మాట్లడలేదని తెలిపింది. కాళేశ్వరం, రామప్ప, ప్రాణహిత, పెనుగంగా బ్యాక్ వాటర్​తో ఏటా పంటలు నష్టపోతే పరిహారం ఇవ్వలేదు.. ఇలాంటి సమస్యలు గురించి ఎందుకు చెప్పలేదని అడిగింది. అనాలోచిత ధోరణితో స్థానిక పరిస్థితులకు అనుకూలంగా డిజైన్ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్దతిలో చెక్​ డ్యామ్​ల నిర్మాణం చేయడం వల్ల.. చెక్​డ్యామ్​లు తెగి సాగు భూములు కోతలకు గురైన సందర్భాలు ఉన్నయని పేర్కొంది. కడెం ప్రాజెక్ట్ కింద భూమి సాగు చేసేందుకు వీలు లేకుండా తుడిచి పెట్టుకుపోతే పరిహారం విషయంలో ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేసింది. అందుకే గతంలో అకాల వర్షానికి, వడగండ్ల వానికి నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు కిసాన్​ కాంగ్రెస్​ ప్రకటించింది.

ధరణి పోర్టల్​పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు: ధరణి సమస్యపై వేలాది అప్లికేషన్​లు పెండింగ్​లో ఉన్నాయని కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి ధ్వజమెత్తారు. ధరణి సమస్యపై ఛీఫ్ సెక్రటరీకి, సీఎం కేసీఆర్​లకు పలుసార్లు సమస్యను తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానందునే రాష్ట్ర హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసామని చెప్పారు. ధరణి సమస్యలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామన్నారు. రైతులను ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో భూసమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. హెచ్ఆర్సీ కలగజేసుకుని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలు కోదండ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అన్వేష్​రెడ్డిలు కోరారు.

"ధరణి పోర్టల్ వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. భూమి పుస్తకాలు దొరకగా కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు పట్టాదారుల పాస్​పుస్తకాలు ఇచ్చాం. ఎన్నో సదస్సులు నిర్వహంచాం. కాని ఈ ప్రభుత్వం అలా ఏమి చెయ్యట్లేదు పైగా భూములు అమ్ముకుంటున్నారు. చివరికి ఫిర్యాదుకు చేసేందుకు హెచ్​ఆర్​సీకి వచ్చాం. "- కోదండరెడ్డి , కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు

ధరణి పోర్టల్​పై రాష్ట్ర హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు చేసిన కిసాన్​ కాంగ్రెస్​

ఇవీ చదవండి:

Last Updated :Apr 3, 2023, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.