ETV Bharat / state

Museum in Warangal fort: కాకతీయ కళా మ్యూజియం.. ఓరుగల్లు కోటకు చేరేదెన్నడో.?

author img

By

Published : Nov 26, 2021, 7:43 AM IST

వరంగల్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు కోట(Museum in Warangal fort). అద్భుతమైన శిలా తోరణాలతో, అపురూప శిల్పాలతో అలరారే కోటలో పురావస్తు ప్రదర్శనశాలను చూసే భాగ్యం మాత్రం పర్యాటకులకు కలగడం లేదు. రాష్ట్ర పర్యాటక శాఖ నిర్మిస్తున్న ఈ మ్యూజియం నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో.. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము వృథా అవుతోంది. ప్రదర్శనశాల ప్రారంభం కాకముందే గోడల పెచ్చులు ఊడిపోతున్నాయి. మందుబాబులకు రాత్రివేళ అడ్డాగా మారుతోంది. నవంబరు 19 నుంచి 25 వరకు వారసత్వ వారోత్సవాల నేపథ్యంలో నిర్లక్ష్యానికి గురవుతున్న మన వారసత్వ సంపదపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Museum in Warangal fort
వరంగల్ కోటలో మ్యూజియం

Museum in Warangal fort: వరంగల్‌లోని మహానగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఎన్నో ఏళ్లుగా రాష్ట్ర పురావస్తు శాఖ ప్రదర్శనశాల ఉంది. ఇందులో 1250 వరకు శాసనాలు, శిల్పాలు, కాకతీయులు వాడిన వస్తువులు భద్రపరిచారు. గతంలో ఈ ప్రాంతంలోనే నక్షత్రశాల, మ్యూజికల్‌ గార్డెన్‌ కూడా ఉండేది. అప్పుడు ఈ మ్యూజియాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. నక్షత్రశాల, మ్యూజికల్‌ గార్డెన్‌ పూర్తిగా మూతబడ్డాక ప్రదర్శనశాలకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పురావస్తు మ్యూజియాన్ని వరంగల్‌ కోటలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో వరంగల్‌ కోట(foundation stone for museum in warangal fort)లోని స్వాగత తోరణాలకు సమీపంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి చందూలాల్‌ ప్రదర్శనశాల భవనానికి శంకుస్థాపన చేశారు. రూ. 3 కోట్ల 80 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఆరేళ్లు గడుస్తున్నా ప్రదర్శనశాల నిర్మాణం పూర్తి కాలేదు.

పూర్తి కాని కాకతీయ కళా మ్యూజియం నిర్మాణం

శిథిలావస్థకు నూతన కట్టడం

ఇప్పుడు ఈ ప్రదర్శనశాల అసంపూర్తిగా మిగలడంతో అసాంఘిక(Archaeological Museum in warangal fort) కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఒకవైపు గోడల పెచ్చులన్నీ ఊడిపోతుండగా, ఆవరణలో పిచ్చి మొక్కలు మొలిచాయి. రాత్రివేళ మందుబాబులు భవనంలో సిగరెట్లు కాల్చి పారేయడం, మద్యం సేవించడం లాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నా పట్టించుకునేవారు లేరు. పర్యాటక శాఖ ఈ భవనం నిర్మాణం పూర్తి చేసి పురావస్తు శాఖకు అప్పగిస్తే వారు పాత మ్యూజియంలోని విలువైన చారిత్రక సంపదను ఇందులోకి తరలించాల్సి ఉంది. కోటలో పురావస్తు ప్రదర్శన శాల ఏర్పాటైతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

మరిన్ని నిధులు అవసరం

పర్యాటకుల కోసం వరంగల్​ కోటలో పురావస్తు ప్రదర్శన శాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ. 3 కోట్ల 80(funds to museum in warangal fort) లక్షలు మంజూరు చేసింది. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. మరిన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి.. ప్రస్తుత మ్యూజియంలో ఉన్న కాకతీయులు వాడిన వస్తువులను తరలించడానికి నిధులు అవసరం. దానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. నిధులు వచ్చిన వెంటనే మిగిలిన పనులు పూర్తి చేస్తాం. త్వరలో వరంగల్​లోనూ శిల్పారామం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. స్థల పరిశీలన పూర్తైన వెంటనే ఆ పనులు చేపడతాం. - శివాజీ, జిల్లా పర్యాటక అధికారి

ఇప్పటికైనా మిగిలిన నిధులను మంజూరు చేసి పర్యాటక శాఖ అధికారులు పనులను పూర్తి చేస్తే ప్రదర్శశాల ఓరుగల్లులో కొత్త పర్యాటక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టుల కేసు.. పిటిషనర్లకు సీబీఐ అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.