ETV Bharat / state

Police Harassment: 'విచారణ పేరుతో కాళ్లు విరిగేలా కొట్టారు'

author img

By

Published : Jan 3, 2022, 5:07 PM IST

Police Harassment: విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారంటూ ఓ మహిళ ఆరోపించిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. హత్య కేసు విషయమై పోలీసులు చిత్రవధకు గురిచేశారని ఆమె తెలిపింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

Police Harassment
Police Harassment

Police Harassment: ఓ హత్య కేసులో విచారణ పేరుతో తమ కుటుంబాన్ని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన భూక్య కమలమ్మ ఆరోపించారు. తన భర్తను కాళ్లు విరిగేలా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయం కోరుతూ పోలీసు ఉన్నతాధికారులు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

భూక్య కమలమ్మ... భర్త బాన్య, కుమార్తె సంధ్య, కుమారుడు రాజేశ్‌తో కలిసి జీడిగడ్డతండాలో నివాసం ఉంటున్నారు. కుమార్తె సంధ్యను 2016లో అదే గ్రామానికి చెందిన గుగులోత్ సతీశ్‌తో వివాహం జరిపించారు. ఆ తర్వాత సతీశ్‌ మరో యువతిని పెళ్లాడాడు. 2021 డిసెంబర్ 1న గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో అతను హత్యకు గురయ్యాడు.

హత్య కేసులో విచారించాలంటూ తనతో పాటు భర్త, కుమారుడిని తీసుకెళ్లి... చెన్నారావుపేట పోలీసులు పది రోజులపాటు ఠాణాలో చిత్రహింసలకు గురిచేశారని కమలమ్మ ఆరోపించారు. పోలీసులు తన భర్తను విచక్ష ణారహితంగా కొట్టడం వల్ల ఆయన రెండు కాళ్లూ విరిగిపోయాయని ఆవేదన వెలిబుచ్చారు. న్యాయం కోసం డిసెంబరు 15న నర్సంపేట ఏసీపీకి, 21న కమిషనర్‌కి, 27న మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు.

విచారణ పేరుతో దాడికి పాల్పడిన ఎస్సై మహేందర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఆలస్యంగా వెలుగు చుసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

మా అల్లుడు ఈనెల 1న చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మమ్మల్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. చేయని నేరానికి నిజం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురిచేశారు. మా భర్తను తీవ్రంగా కొట్టడం వల్ల కాళ్లు విరిగిపోయాయి. నన్ను కూడా కొట్టారు. చేయని నేరానికి పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు. ఈ విషయంలో మాకు న్యాయం జరగాలి.

-- భూక్య కమలమ్మ, బాధితురాలు

'విచారణ పేరుతో కాళ్లు విరిగేలా కొట్టారు'

ఇవీ చూడండి:

vikarabad si dead in accident: పెళ్లైన వారం రోజులకే రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి

New Year Road accidents: ప్రమాదాలతో ప్రారంభమైన న్యూఇయర్​.. ఓ ఎస్సై సహా 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.