ETV Bharat / state

నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నా: రాజయ్య

author img

By

Published : Mar 12, 2023, 3:59 PM IST

Updated : Mar 12, 2023, 5:12 PM IST

MLA Rajaiah Sarpanch Navya Issue Latest Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన జానకీపురం సర్పంచ్​ లైంగిక వేధింపుల ఘటన ఓ కొలిక్కివచ్చింది. పార్టీ పెద్దలు, అధిష్ఠానం కలుగజేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సర్పంచ్ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే రాజయ్య వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇద్దరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

MLA Rajaiah Sarpanch Navya
MLA Rajaiah Sarpanch Navya

నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నా: రాజయ్య

MLA Rajaiah Sarpanch Navya Issue Latest Updates: రాష్ట్రంలో ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజయ్య వరంగల్‌ జిల్లాలోని ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. అధిష్ఠానం ఆదేశం, నవ్య భర్త ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు. పార్టీ అధిష్ఠానం తనకు పలు సూచనలు చేసిందని వివరించారు. అందరూ కలిసి పనిచేయాలని చెప్పిందని రాజయ్య పేర్కొన్నారు.

తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నాను: ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని తెలిపారు. తాను ఏ ఊరి పట్ల వివక్ష చూపలేదని పేర్కొన్నారు. మహిళలు వారి హక్కులు సాధించుకోవాలని వివరించారు. ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని వివరించారు. ఎవరికైనా తన వల్ల బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

ఎవరైనా మానసిక క్షోభకు గురైతే క్షమాపణలు చెబుతున్నానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. గతంలో పార్టీ ఆదేశానుసారం ఉపముఖ్యమంత్రి పదవి వదులుకున్నానని గుర్తు చేశారు. మహిళల హక్కుల కోసం పోరాటంలో తాను ఉంటానని వివరించారు. జానకీపురం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని రాజయ్య వెల్లడించారు.

మరోవైపు ఈ క్రమంలోనే జానకీపురం సర్పంచ్ నవ్య మాట్లాడారు. చెడును తాను కచ్చితంగా ఖండిస్తానని నవ్య తెలిపారు. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజయ్య వల్లే తాను సర్పంచ్‌ను అయ్యాయని గుర్తు చేశారు. రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దని వివరించారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని వెల్లడించారు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యమని ఆమె అన్నారు.

"జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా. నేను ఏ ఊరి పట్ల వివక్ష చూపలేదు. మహిళలు వారి హక్కులు సాధించుకోవాలి. నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నా. ఎవరైనా మానసిక క్షోభకు గురైతే క్షమాపణ కోరుతున్నా. పార్టీ ఆదేశానుసారం ఉపముఖ్యమంత్రి పదవి వదులుకున్నా. మహిళల హక్కుల కోసం పోరాటంలో నేనూ ఉంటా. జానకీపురం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా." -రాజయ్య, ఎమ్మెల్యే

మాకు దక్కాల్సిన గౌరవం దక్కకుంటే సహించేది లేదు. మహిళలపై అరాచకాలు జరిగితే ఊరుకోను. మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు సిద్ధం. పార్టీలో తప్పులు జరిగితే ఖండిస్తూనే ఉంటా.. తప్పా ఒప్పని చెప్పలేను.- నవ్య, జానకీపురం సర్పంచ్

ఇవీ చదవండి:

Last Updated :Mar 12, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.