ETV Bharat / state

'ప్రతియేటా ప్రకటించే 300 కోట్లు ఏమయ్యాయి'

author img

By

Published : Jan 3, 2020, 11:53 PM IST

పెంచిన పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పట్టణ జిల్లా కాజిపేటలో కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రతియేటా వరంగల్ నగరాభివృద్ధికి ప్రకటించే 300 కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

'300 crore announcements every year' at warangal urban district
'ప్రతియేటా ప్రకటించే 300 కోట్లు ఏమయ్యాయి'

పెంచిన పన్నుల భారాన్నినిరసిస్తూ కాజిపేట మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ నాయకులు నిరసన తెలిపారు. నూతన సంవత్సర కానుకగా తెరాస ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ నగరవాసులపై పన్నుల భారం మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సరైన మౌలిక వసతులు కల్పించకుండా ప్రజలపై పన్నులు మోపడం ఏంటని ప్రశ్నించారు.

'ప్రతియేటా ప్రకటించే 300 కోట్లు ఏమయ్యాయి'

వరంగల్ పట్టణ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతియేటా వరంగల్ నగరాభివృద్ధికి 300 కోట్లు ఇస్తామని చెప్పి విస్మరించారని అన్నారు. ఆ నిధుల వివరాలు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. పెంచిన పన్నులను తగ్గించని పక్షంలో వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి : నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు

Intro:Tg_wgl_01_03_cong_dharna_on_muncipal_taxes_v.o_ab_ts10077


Body:పెంచిన పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేటలో కాంగ్రెస్స్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పెంచిన పన్నుల భారాన్ని నిరసిస్తూ కాజిపేట మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నూతన సంవత్సర కానుకగా తెరాస ప్రభుత్వం, గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ పన్నులను పెంచి నగరవాసులపై భారం మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సరైన మౌలిక వసతులు కల్పించకుండా ప్రజలపై పన్నులు మోపడం ఏమిటి అని వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా వారంగల్ నగరాభివృద్ధికి 300 కోట్లు ఇస్తామని చెప్పి విస్మరించారని చెప్పారు. పెంచిన పన్నులను తగ్గించని పక్షంలో వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు..... బైట్
నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.







Conclusion:cong dharna
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.