ETV Bharat / state

దేశానికే వరంగల్‌ ఆస్పత్రి మోడల్‌గా నిలవబోతోంది: హరీశ్‌రావు

author img

By

Published : Jan 28, 2023, 5:08 PM IST

Harish Rao
Harish Rao

Harish Rao on Warangal Super Specialty Hospital: వరంగల్‌ నగరాన్ని హైదరాబాద్‌ తరహాలో తీర్చిదిద్దేందుకు... ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వరంగల్‌లో 24 అంతస్తుల్లో నిర్మిస్తున్న... హెల్త్‌ సిటీ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. దేశానికే ఇది మోడల్‌ ఆసుపత్రిగా నిలబోతోందని... కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు.

Harish Rao on Warangal Super Specialty Hospital: చారిత్రక నగరిగా ఖ్యాతి పొందిన వరంగల్​లో అధునాతనమైన వైద్య సేవల కోసం నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆసుపత్రి రోగులకు సరిపోకపోవడంతో.. కేంద్ర కారాగారాన్ని తొలగించి.. ఆ ప్రాంతంలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందుతూ.. వరంగల్ నగరం ఓ హెల్త్ సిటీగా నిలవాలన్న ఆకాంక్షతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో.. ఈ ఆసుపత్రి నిర్మాణానికి సంకల్పించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్​ను స్ఫూర్తిగా తీసుకుని... వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దసరా కల్లా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను, నిర్మాణ ఏజెన్సీని కోరినట్లు పేర్కొన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని... అందులో భాగంగానే 24 అంతస్తులతో అధునాతన ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన... అధికారులకు పలు సూచనలు చేశారు. అవయవ మార్పిడి సంబంధించి శస్త్రచికిత్సలూ హైదరాబాద్ కు వెళ్లనవసరం లేకుండా ఇక్కడే జరుగుతాయని తెలిపారు.

దేశానికే ఇది మోడల్‌ ఆసుపత్రిగా నిలబోతోంది : వరంగల్‌ నగరాన్ని హైదరాబాద్‌ తరహాలో తీర్చిదిద్దేందుకు... ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వరంగల్‌లో 24 అంతస్తుల్లో నిర్మిస్తున్న... హెల్త్‌ సిటీ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. దేశానికే ఇది మోడల్‌ ఆసుపత్రిగా నిలబోతోందని... కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. కొత్తగా నిర్మించిన... ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు చేపట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ హయాంలో... వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే 8 వైద్య కళాశాలలు నిర్మించామన్నారు.

దేశానికే వరంగల్‌ ఆస్పత్రి మోడల్‌గా నిలవబోతోంది: హరీశ్‌రావు

'దసరా కల్లా ఆస్పత్రి పూర్తి చేసి ఇవ్వాలని ఏజెన్సీని కోరాం. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందాలన్నదే సీఎం లక్ష్యం. కాళేశ్వరం తరహాలోనే ఆస్పత్రి పనులు జరుగుతున్నాయి. జిల్లాకో వైద్య కళాశాల ఉండాలన్నది సీఎం లక్ష్యం. వైద్యా విద్య చదవాలంటే ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంబీబీఎస్‌తో పాటు పీజీ వైద్య సీట్లు పెంచుతాం. కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అయ్యింది. మిగతా రాష్ట్రాలకు కంటి వెలుగు పథకం ఆదర్శం. ఈ ఏడాది 9 వైద్యా కళాశాలలు అందుబాటులోకి తెస్తాం'- హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

కాకతీయ కళా నైపుణ్యం ఉట్టి పడేలా శివాలయం : అంతకుముందు వరంగల్ జిల్లా పర్వతగిరిలో నూతనంగా నిర్మించిన పర్వతాల శివాలయంలో లింగ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయ కళా నైపుణ్యం ఉట్టి పడేలా రాతి స్తంభాలతో సుందరంగా నిర్మించారని మంత్రి హరీష్‌ రావు కొనియాడారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వామి వారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించారు. లింగ ప్రతిష్టానంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.