ETV Bharat / state

Seethakka at Dhabirpet: 'ఎమ్మెల్యేకే గౌరవం లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?': సీతక్క

author img

By

Published : Jun 18, 2022, 7:31 PM IST

Seethakka at Dhabirpet: వరంగల్‌ జిల్లా దబీర్‌పేటలో రాకేశ్ అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాకేశ్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ములుగు కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్కను తెరాస శ్రేణులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది.

Seethakka
కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క

Seethakka at Dhabirpet: వరంగల్ జిల్లా దబీర్ పేటలో రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాకేష్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ములుగు కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్కను తెరాస నాయకులు అడ్డుకున్నారు. సీతక్క గోబ్యాక్ గోబ్యాక్ అంటూ తెరాస నాయకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

'ఎమ్మెల్యేకే గౌరవం లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?': సీతక్క

ఈ రాష్ట్రంలో ఓ మహిళా ఎమ్మెల్యేకే గౌరవం లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? మేం ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. కేంద్రం వెంటనే అగ్నిపథ్​ను వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలో కూడా పీసీసీ అధ్యక్షుడిని అరెస్టులు చేయడం సరైంది కాదు. - సీతక్క, ములుగు ఎమ్మెల్యే

వారు నివాళులర్పిస్తున్నప్పుడు మేమేందుకు నివాళులు అర్పించకూడదని సీతక్క ప్రశ్నించారు. దీంతో తీవ్ర వాగ్వాదం తలెత్తింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువైపులా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఈ వాగ్వాదం సాగుతుండగానే మరోవైపు తెరాస నాయకులు కాంగ్రెస్ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని సీతక్కకు వలయంగా ఏర్పడి అక్కడ నుంచి తరలించారు. తెరాస నాయకుల తీరుపై సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Damera Rakesh's funeral: అశ్రునయనాల మధ్య ముగిసిన రాకేష్​ అంత్యక్రియలు

ఆగని 'అగ్గి'.. వాహనాలు 'బుగ్గి'.. దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా 'అగ్నిపథ్​' నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.