దుష్ట శక్తులకు బుద్ధి చెబితేనే దేశం బాగుంటుందన్న కేసీఆర్‌

author img

By

Published : Aug 16, 2022, 6:34 PM IST

Updated : Aug 16, 2022, 6:52 PM IST

CM KCR
CM KCR ()

CM KCR on BJP తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ఉన్న భాజపా ఎనిమిదేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి చేసిందా అని ప్రశ్నించారు. వికారాబాద్​ జిల్లాకేంద్రంలో నూతన కలెక్టరేట్ భవనం​ ప్రారంభించిన సీఎం బహిరంగ సభలో కేంద్రం తీరుపై విమర్శలు సంధించారు.

CM KCR on BJP రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుపడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని వెల్లడించారు. వికారాబాద్​ జిల్లాకేంద్రంలో నూతన కలెక్టరేట్ భవనం​ ప్రారంభించిన సీఎం అనంతరం బహిరంగ సభలో కేంద్రం తీరుపై విమర్శలు సంధించారు. కేంద్రమే లక్ష్యంగా సీఎం విమర్శలు ఎక్కుపెట్టారు.

మన కడుపు కొట్టి దోచిపెడుతున్నారు: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క మంచి పనైనా చేసిందా అని ప్రశ్నించారు. కేంద్రంలో భాజపా పాలనపై గ్రామాల్లో చర్చలు చేపట్టాలని సూచించారు. మోదీ ఈ దేశానికి ఏం చేశారో మీరే చెప్పాలన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా ఉచిత పథకాలు వద్దని చెబుతోందని విమర్శించారు. భాజపా మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గృహ, వ్యాపార, వాణిజ్య పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్‌ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చాం: మిషన్‌ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు అందించామని పేర్కొన్నారు. పేదింటి బిడ్డల కోసం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో రైతులు భూములు అమ్ముకుని హైదరాబాద్‌లో కూలీలుగా పని చేసేవారని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్ర రూపురేఖలు మారడంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. రైతు బంధు ద్వారా వ్యవసాయం సస్యశ్యామలంగా మారిందని పేర్కొన్నారు. రైతు శ్రేయస్సు కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు మరణించిన రైతు కుటుంబానికి నేరుగా రూ.5 లక్షల బీమా ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ స్వార్థ రాజకీయాలకు బలి కాకుండా కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

నెత్తికి రుమాలు డైలాగ్​లు తప్ప ఎనిమిదేళ్లలో ఏమైనా చేసిండ్రా. సీఎం కేసీఆర్

కేంద్రంలో ఎనిమిదేళ్ల భాజపా పాలనలో ఒక్కటంటే ఒక్క మంచి చేశారా?. కేంద్రంలో భాజపా పాలనపై గ్రామాల్లో చర్చలు చేపట్టాలి. మోదీ...ఈ దేశానికి ఏం చేశారో చెప్పండి. మోదీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా ఉచిత పథకాలు వద్దని చెబుతోంది. భాజపా మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతోంది. గతంలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంత? ఇప్పుడు ఎంత? భాజపాను నమ్మితే పెద్ద ప్రమాదం. మన రాష్ట్రంలో పరిస్థితి భాజపా పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి గమనించండి. ఈరోజు ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడు. - కేసీఆర్, సీఎం

కేంద్రం వల్లే ప్రాజెక్టులు ఆలస్యం: కృష్ణా జలాల్లో వాటాలను అడ్డుకుంటున్నది భాజపానే అని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కేంద్రం వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యమవుతోందని విమర్శించారు. ఎనిమిదేళ్ల నుంచి వందకుపైగా దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఈరోజు ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వికారాబాద్‌, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్లు రప్పిస్తామన్నారు. రాష్ట్రం ఎంత బాగున్నా కేంద్రంలో బాగాలేకపోతే ఆశించిన అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు.

మన భూములే ధరలే ఎక్కువ: ఉద్యమ సమయంలో వికారాబాద్‌లో రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారని సీఎం వెల్లడించారు. రాష్ట్రం సిద్ధిస్తే వికారాబాద్‌నే జిల్లా చేసుకుందామని చెప్పానని తెలిపారు. తెలంగాణ రాకుంటే వికారాబాద్‌ జిల్లా అయ్యేదా? వికారాబాద్‌కు వైద్య కళాశాల వచ్చేదా? అని పేర్కొన్నారు. గతంలో సంక్షేమ పథకాలు ఎలా ఉండేవి...ఇప్పుడు ఎలా అమలు చేస్తున్నామో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోతాయని ప్రచారం చేశారని వెల్లడించారు. ఏపీ, కర్ణాటక కంటే రంగారెడ్డి జిల్లాలోనే భూముల ధరలు ఎక్కువని తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో మూడెకరాల భూమికి తెలంగాణలో ఒక ఎకరానికి సమానమని స్పష్టం చేశారు. కొత్త పింఛన్లు నిన్నటి నుంచి పంపిణీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు.

ఇవీ చదవండి: జాతీయ గీతాలాపనకు వచ్చిన విశేష స్పందనకు ఈ చిత్రమాలికే నిదర్శనం

Vikarabad Collectorate వికారాబాద్​ కలెక్టరేట్​ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

భారత సైన్యానికి సరికొత్త అస్త్రాలు, దుందుడుకు చైనాకు ఇక చెక్

Last Updated :Aug 16, 2022, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.