భారత సైన్యానికి సరికొత్త అస్త్రాలు, దుందుడుకు చైనాకు ఇక చెక్

author img

By

Published : Aug 16, 2022, 5:38 PM IST

Rajnath Singh Handed Over Weapons

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. జల, వాయు మార్గాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. పాంగాంగ్‌ సరస్సులో ఏ మూలకైనా నిమిషాల్లో చేరుకునేలా తయారు చేసిన బోటుతో సహా మరికొన్ని ఆయుధాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యానికి అందజేశారు.

Rajnath Singh Handed Over Weapons: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. పాంగాంగ్‌ సరస్సుపై పట్టు సాధించేందుకు అధునాతన బోట్‌లను అందుబాటులోకి తెచ్చింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ బోట్‌లను భారత సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ బోటు ఒకేసారి 35 మంది సైనికులను సరస్సులోని ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో చేర్చగలదు. దీనివల్ల సరిహద్దుల్లో భారత సైనిక శక్తి పెరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ బోట్‌లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు.

ప్యాంగాంగ్‌ సరస్సుపై పట్టు సాధించేందుకు అధునాతన బోట్లు, దేశీయంగా తయారు చేసిన డ్రోన్​ వ్యవస్థ
Rajnath Singh Handed Over Weapons
ఆయుధ వ్యవస్థను అందజేస్తున్న రక్షణ మంత్రి

సరిహద్దుల్లో శత్రు దేశాల కదలికలను నిశితంగా పరిశీలించేందుకు.. దేశీయంగా తయారు చేసిన డ్రోన్‌ వ్యవస్థ కూడా భారత అమ్ములపొదిలో చేరింది. ఈ నిఘా డ్రోన్‌ సరిహద్దుల్లో సూక్ష్మమైన కదలికలను కూడా పసిగట్టగలుగుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ డ్రోన్‌ వ్యవస్థ సాయంతో సరిహద్దులో భారత్‌ బలం మరింత పెరగనుంది. వాటితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైనికులకు F-INSAS వ్యవస్థకు సంబంధించిన AK-203 అసాల్ట్ రైఫిల్స్​ను రాజనాథ్​ సింగ్​ అందజేశారు.

Rajnath Singh Handed Over Weapons
ఆయుధ వ్యవస్థను అందజేస్తున్న రాజ్​నాథ్​ సింగ్​
Rajnath Singh Handed Over Weapons
ఆర్మీ అధికారులతో రాజ్​నాథ్​ సింగ్​
Rajnath Singh Handed Over Weapons
ఆయుధ వ్యవస్థను పరిశీలిస్తున్న రాజ్​నాథ్

ఇవీ చదవండి: బిల్కిస్ బానో అత్యాచార నిందితుల విడుదలపై వివాదం, విపక్షాలు ఫైర్

ప్రాక్టీస్​ సెషన్​లో పల్టీలు కొట్టిన కబడ్డీ ప్లేయర్, తలకు తీవ్ర గాయంతో మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.