ETV Bharat / state

'కబ్జాదారుల నుంచి రైతుల భూములను కాపాడాలి'

author img

By

Published : Jan 21, 2021, 7:03 PM IST

సూర్యాపేట జిల్లాలో కబ్జాదారుల నుంచి రైతుల భూములను కాపాడాలని... తెలంగాణ తెదేపా నాయకులు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో పిటిషన్ దాఖలు చేశారు. పలు కంపెనీలు అక్కడ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

Telangana TDP leaders filed a petition in the state human rights commission
కబ్జాదారుల నుంచి రైతుల భూములను కాపాడాలి

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు , మఠంపల్లి మండలాల్లో రైతుల భూములను కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని... తెలంగాణ తెదేపా అధికార ప్రతినిధి జ్యోత్స్న అన్నారు. వారి నుంచి రైతులను రక్షించాలని... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో పిటిషన్ దాఖలు చేశారు.

మేళ్లచెరువు మండలంలో వందల ఎకరాల భూములను ఎస్సీలు సాగు చేసుకుంటున్నారని ఆమె తెలిపారు. పలు సిమెంటు కంపెనీలు ఆ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తుంటే... పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

మఠంపల్లి మండలంలో స్థానిక గిరిజన రైతులను భూముల్లోకి వెళ్లకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని అన్నారు. వారి హక్కులను కాలరాస్తూ... మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. వారి నుంచి రైతుల భూములను కాపాడే విధంగా, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్​ఆర్​సీని కోరారు.

ఇదీ చదవండి: విబేధాలు వీడండి.. పార్టీని గెలిపించండి : కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.