ETV Bharat / state

ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి పోలీసులు బదిలీలు చేయించుకుంటున్నారు: ఉత్తమ్​కుమార్​

author img

By

Published : Sep 23, 2021, 4:11 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి పర్యటించారు. తెరాస, కాంగ్రెస్​ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన తమ పార్టీ వ్యక్తులను పరామర్శించారు. ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

mp uttamkumar reddy visited gurrampodu thanda
mp uttamkumar reddy visited gurrampodu thanda

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో.. జరిగిన ఘర్షణలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి పరామర్శించారు. అధికార పార్టీ నాయకులు.. కాంగ్రెస్ నాయకుల ఇంటిపై దాడి చేసి... పూర్తిగా ధ్వంసం చేశారని ఉత్తమ్​ ఆరోపించారు. ఎంపీపీ స్థాయిని మరిచిపోయి ఇంటిపై విచక్షణారహితంగా దాడులు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై డీజీపీని కలిసి కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. మఠంపల్లి ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అధికారం శాశ్వతం కాదు..

"ముఖ్యమంత్రి కేసీఆర్ అల్లుడు ఎంపీ సంతోష్ ఆదేశాలతో... అధికార పార్టీ ఎమ్మెల్యేలకు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు.. ఐదు నుంచి 15 లక్షల వరకు ఇచ్చి కోరుకున్న చోటుకు బదిలీ అవుతున్నారు. పోలీస్​శాఖలోనే ఈ విధంగా ఉంటే ఇక వీరు చేస్తున్న ఉద్యోగానికి విలువ ఏముంటుంది. స్థానిక ఎమ్మెల్యే 100 ఎకరాలు పైనే ఆక్రమించారు. ఎంపీపీ కొండా నాయక్ మరో వంద ఎకరాలు ఆక్రమించారు. ఆయన అనుచర గణంతో అమాయక గిరిజనులను భయపెట్టి, బెదిరించి భూములన్నీ లాక్కుంటున్నారు. అధికారం శాశ్వతం కాదు, ఇక మీ పని అయిపోయింది. ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి."

-ఉత్తమ్​కుమార్​ రెడ్డి, ఎంపీ

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.