ETV Bharat / state

KTR responds: చిన్నారులకు కేటీఆర్ ఆపన్నహస్తం

author img

By

Published : Jun 11, 2021, 7:26 PM IST

Updated : Jun 11, 2021, 8:13 PM IST

ask ktr
ask ktr

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ముగ్గురు చిన్నారులను పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ తల్లి దయనీయ స్థితిపై మంత్రి కేటీఆర్ ట్టిట్టర్​లో స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్​ కుమార్​ను ట్యాగ్​ చేస్తూ.. వారికి సాయం చేయాల్సిందిగా కోరారు. మంత్రి సూచనల మేరకు.. ఎమ్మెల్యే ఆ కుటుంబానికి నగదు సాయం చేసి అండగా నిలిచారు.

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం చాకలిగూడెంకు చెందిన సతీశ్​.. 8 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలుండగా.. వారిని పోషించుకోలేని ఆ తల్లి దీనస్థితిని స్థానికులు ట్విట్టర్​లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ట్వీట్​పై స్పందించిన మంత్రి.. వారికి సాయం చేయాల్సిందిగా కోరుతూ స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్​ను ట్యాగ్​ చేశారు. మంత్రి సూచనల మేరకు.. ఎమ్మెల్యే ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

ముగ్గురు చిన్నారుల పేరిట.. బ్యాంకు ఖాతాలు తెరిచి ఒక్కొక్కరి ఖాతాలో రూ. 50 వేలను ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేశారు. తక్షణ సాయం కింద మరో 50 వేలను వారి తల్లికి ఆర్థికసాయంగా అందజేశారు. పిల్లల చదువుతో పాటు తల్లికి ఔట్ సోర్సింగ్​ కింద ఉద్యోగం కల్పించి.. ఉండడానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇప్పిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: వాన నీటిలో నడుస్తున్నారా? జర భద్రం!

Last Updated :Jun 11, 2021, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.