ETV Bharat / state

ప్రజలకు ఆసరాగా సంక్షేమ పథకాలు: జగదీశ్​రెడ్డి

author img

By

Published : Feb 3, 2021, 2:14 PM IST

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తలపెట్టిన 'ప్రజల కోసం-ప్రగతి కోసం' కార్యక్రమంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి కోదాడలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు.

సంక్షేమ పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి: జగదీశ్​రెడ్డి
సంక్షేమ పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి: జగదీశ్​రెడ్డి

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తలపెట్టిన 'ప్రజల కోసం-ప్రగతి కోసం' కార్యక్రమంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు.

ఇరువురు వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన 33 కేవీ విద్యుత్ తీగలను తొలగిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. బాధ్యతను మరవకుండా 'ప్రజల కోసం- ప్రగతి కోసం' కార్యక్రమం తలపెట్టిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ను అభినందించారు. కోదాడ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, మున్సిపల్ ఛైర్​పర్సన్ వనపర్తి శిరీష తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: విరగబూసిన మామిడి పూత... ఆనందంలో రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.