ETV Bharat / state

KCR Speech in BRS Meeting in Suryapet : 'బీఆర్​ఎస్​ విజయంపై అనుమానం లేదు.. గతంలో కంటే 5 సీట్లు ఎక్కువే వస్తాయి'

author img

By

Published : Aug 20, 2023, 6:12 PM IST

Updated : Aug 20, 2023, 8:23 PM IST

KCR Speech in BRS Meeting in Suryapet : రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంట్‌ కష్టాలు, భూదళారులు రాజ్యమేలుతారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. కర్ణాటకలో గెలిపించినందుకు ఇప్పటికే కరెంట్‌ కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రం.. కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​లకు ఓటువేస్తే ఆగమవుతుందని విమర్శించారు. తెలంగాణలో రూ.4వేలు పింఛన్ ఇస్తామంటున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు. పింఛన్‌ మొత్తాన్ని తప్పకుండా పెంచుతామని సూర్యాపేట సభావేదికగా హామీ ఇచ్చారు.

KCR Speech in BRS Meeting
KCR Speech in BRS Meeting

KCR Speech in BRS Meeting in Suryapet బీఆర్​ఎస్​ విజయంపై అనుమానం లేదు.. గతంలో కంటే 5 సీట్లు ఎక్కువే వస్తాయి

KCR Fires on Congress at Suryapet BRS Meeting : ముఖ్యమంత్రి కేసీఆర్​ సూర్యాపేటలో విస్తృతంగా పర్యటించారు. మెడికల్‌ కళాశాల, ఎస్పీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్‌ భవనంతో పాటు బీఆర్​ఎస్​ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా మెడికల్‌ కళాశాల భవనాల్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా బీఆర్​ఎస్​ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత సమీకృత వెజ్‌-నాన్‌వెజ్‌ మోడల్‌ మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చిన సీఎం కేసీఆర్​.. ఆవరణలో మంత్రులు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డితో కలిసి కలియతిరిగారు.

అక్కడి నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకున్న కేసీఆర్‌ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం 21ఎకరాల్లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ఎదుట పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. నూతన భవన సముదాయాన్ని ప్రారంభించి... అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. సూర్యాపేటలో (Suryapet ) 100కోట్లకు పైగా ఖర్చుతో భవనాలు నిర్మించినట్లు సీఎం తెలిపారు. తలసరి విద్యుత్‌, తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచామని తెలిపారు. ఆర్థిక, సాంఘిక అసమానతలు తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

KCR Fires on Congress : అనంతరం జరిగిన ప్రగతి నివేదన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. బీఆర్​ఎస్​ సర్కార్‌ అభివృద్ధిని వివరిస్తూనే విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ ఆపదమొక్కులు మొక్కేందుకు కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు వస్తున్నారని వారిని నమ్మితే ఆగమైపోతామని సూచించారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందని మరో అవకాశం కావాలని అడుగుతోందని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛను ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.

KCR Comments on Dharani Portal : భూసమస్యలకు పరిష్కారమార్గంగా మారిన ధరణిని తీసేస్తామని కాంగ్రెస్‌ అంటోందని అదే జరిగితే... మరోసారి దళారీరాజ్యం వస్తుందని పునరుద్ఘాటించారు. బీఆర్​ఎస్​ సర్కార్‌ అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలన్న కేసీఆర్‌.. వచ్చే ఎన్నికల్లో తమ విజయంపై ఎవరికీ అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల కంటే మరో 5 సీట్లు ఎక్కువే వస్తాయని తెలిపారు. కుల వృత్తులు చేసుకునే బీసీ బిడ్డలకు రూ.లక్ష చొప్పున ఇస్తున్నామని వివరించారు. కాళేశ్వరం జలాలు 480 కి.మీ. ప్రయాణించి సూర్యాపేట జిల్లాలోకి వస్తున్నాయని తెలిపారు.

సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు: జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నిధులు ఇస్తామన్నారు. కళాభారతి నిర్మాణానికి రూ.25 కోట్లు మంజురు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు కేటాయించామన్నారు. సూర్యాపేట అభివృద్ధికి మరో రూ.50 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రూ.30 వేల కోట్లతో పవర్‌ ప్రాజెక్టు... గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. సూర్యాపేటను జిల్లాగా చేసినట్లు గుర్తు చేశారు.

"రూ.37 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత బీఆర్​ఎస్​ది. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. ధాన్యం దిగుబడిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమించింది. తెలంగాణ నుంచి వలస పోయిన ప్రజలు తిరిగివస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న రైతుబంధు నిధులు కూడా అందరికీ వస్తాయి. ధరణి ఉండాలో.. తీసివేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలి".- కేసీఆర్​, తెలంగాణ సీఎం

వాహనాలు దారి మళ్లింపు.. భారీ ట్రాఫిక్​ జామ్​: కేసీఆర్​ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్​ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. పోలీసుల ముందు జాగ్రత్తగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు దారి మళ్లించారు. కోదాడ వద్ద హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మళ్లించారు. మిర్యాలగూడ మీదుగా వెళ్లేందుకు భారీ వాహనదారుల నిరాకరించడంతో జాతీయ రహదారి మీదనే నిలిపి వేశారు. దీంతో కోదాడ పట్టణంలో భారీగా వాహనాల రద్దీ పెరిగింది.

Sanjay Kumar Comments on MLA Ticket : 'టికెట్ వస్తుందో రాదో.. పోటీ చేస్తానో లేదో'.. కాకరేపుతున్న ఎమ్మెల్యే సంజయ్​ కామెంట్స్

Minister Harish Rao Inaugurate MCH Block at Gandhi Hospital : 'ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాతా శిశు మరణాలు చాలా వరకు తగ్గించాం'

BRS Political War in Jangaon District : జనగామలో రోడ్డెక్కిన బీఆర్​ఎస్​ రాజకీయం.. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీల తంటా

Last Updated : Aug 20, 2023, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.