ETV Bharat / state

జాతర సమయం తరుముకొస్తోంది.. పని మొరాయిస్తోంది!

author img

By

Published : Feb 4, 2021, 9:52 AM IST

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత లింగమంతుల స్వామి జాతర రెండో స్థానంలో నిలుస్తోంది. ఈ జాతర ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు అయిదు రోజుల పాటు జరగనుంది. దిష్టి పూజతో మొదలయ్యే వేడుకకు 10 రోజుల సమయమే ఉన్నా.. ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు.

arrangements-for-durajpally-peddagattu-jathara
ఈ నెల 28 నుంచి లింగమంతుల జాతర

సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి గుట్టపై లింగమంతులు జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 14వ తేదీన దిష్టి పూజతో జాతర మొదలవుతుంది. అనంతరం 28 నుంచి మార్చి 4 వరకు... 5 రోజుల పాటు కన్నులపండువగా సాగనుంది. స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు తరలివస్తారు. ప్రతిఏటా దాదాపు 8 లక్షల మంది హాజరవుతుంటారు. స్వామివారిని దర్శించుకొని మెుక్కులు చెల్లించుకుంటారు.

ఈ నెల 28 నుంచి లింగమంతుల జాతర

పూర్తి కాని ఏర్పాట్లు

ఈ ఏడాది జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు కేటాయించింది. అయితే... జాతర ప్రారంభం కావటానికి కొద్ది రోజులే సమయం ఉండగా.... ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు వంటి వసతుల కల్పించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయం ప్రసిద్ధి గాంచి ఏళ్లు గడుస్తున్నా.... ప్రభుత్వం ప్రతి ఏటా నిధులు కేటాయిస్తున్నా..... శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి జరగటం లేదని స్థానికులు వెల్లడించారు. ఆలయానికి మూడు వైపుల గల మెట్ల దారులకు రాజగోపురాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

ధర్మకర్తల మండలి ఏది?

లింగమంతుల స్వామి ఆలయానికి... మూడేళ్లపాటు కొలువయ్యే ధర్మకర్తల మండలి ఉండాలి. కాలక్రమేణా ఆ కాల పరిమితిని ఏడాదికి కుదించారు. కానీ, కొన్ని సంవత్సరాల నుంచి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయకపోగా... కేవలం ఉత్సవ కమిటీ వేసి జాతర నిర్వహిస్తున్నారు. అందువల్ల జాతర నిర్వహణపై అధికారులు దృష్టిసారించలేకపోతున్నారు.

వసతులు కల్పనేది?

జాతర సమయంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఒకవైపు మూసివేస్తారు. అంత పెద్ద ఎత్తున జరిగే లింగమంతుల స్వామి జాతరకు... వెంటనే ఏర్పాట్లు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.