ETV Bharat / state

ఆ పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు: తల్లోజీ ఆచారి

author img

By

Published : Oct 27, 2020, 7:43 PM IST

ఆ పోలీసులపై చర్యలు  ఎందుకు తీసుకోలేదు: తల్లోజీ ఆచారి
ఆ పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు: తల్లోజీ ఆచారి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై సిద్దిపేటలో పోలీసుల ప్రవర్తనను జాతీయ బీసీ కమిషన్​ సుమోటోగా తీసుకుంది. దురుసుగా వ్యవహరించిన అధికారులు, పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని డీజీపీకి కమిషన్​ సభ్యుడు తల్లోజీ ఆచారి నోటీసులు పంపారు. బీసీ హక్కులను కాపాడటం రాజ్యంగ విధి అని నోటీసులో పేర్కొన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసుల ప్రవర్తనను జాతీయ బీసీ కమిషన్​ సుమోటోగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కమిషన్​ నోటీసులు జారీ చేసింది. దురుసుగా ప్రవర్తించిన అధికారులు, పోలీసులపై కేసు ఎందుకు పెట్టలేదని కమిషన్‌ ప్రశ్నించింది. కేసు ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు పంపింది.

ఈ ఘటనపై నవంబర్​ ఐదులోగా పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజీ ఆచారి ఆదేశించారు. బండి సంజయ్ బీసీ వర్గానికి చెందినవారని తెలిపారు. బీసీ హక్కులను కాపాడటం రాజ్యంగ విధి అని నోటీసులో పేర్కొన్నారు.

national-bc-commission-gave-notice-to-state-government-chief-secretory-and-dgp-about-siddipeta-issue
జాతీయ బీసీ కమిషన్​ జారీ చేసిన నోటీసు

ఇదీ చదవండి: కొనసాగుతున్న బండి సంజయ్‌ దీక్ష.. పార్టీ శ్రేణుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.