ETV Bharat / state

త్వరలో సిద్దిపేటకు వాలీబాల్ అకాడమీ: హరీశ్​రావు

author img

By

Published : Feb 19, 2021, 12:25 PM IST

త్వరలో సిద్దిపేటకు వాలీబాల్ అకాడమీ: హరీశ్​రావు
త్వరలో సిద్దిపేటకు వాలీబాల్ అకాడమీ: హరీశ్​రావు

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 6వ తెలంగాణ అంతర్ జిల్లాల సీనియర్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ -2021 పోటీలను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. త్వరలో సిద్దిపేటకు వాలీబాల్ అకాడమీ రానుందని వెల్లడించారు.

అన్ని క్రీడలకు సిద్దిపేట వేదిక కానుందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 6వ అంతర్​ జిల్లాల సీనియర్ వాలీబాల్ ఛాంపియన్ షిప్​-2021 పోటీలను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్​ పోటీలకు సిద్దిపేట వేదక కావడం గౌరవంగా ఉందని మంత్రి వెల్లడించారు. వాలీబాల్ అనేది గ్రామీణప్రాంత యువతకు అందుబాటులో ఉండే గేమ్​ అని... విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు.

పిల్లలకు ఆస్తి ఇవ్వడం కాదు.. క్రీడలు నేర్పించడం ముఖ్యమని హరీశ్​ రావు చెప్పారు. ఆరోగ్యం లేకుంటే.. అర్థం లేదన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతీయస్థాయి వాలీబాల్ ట్రోఫీ అతి పెద్ద సిద్ధిపేట వేదిక కావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ ఛైర్మన్​ రోజా శర్మ, మున్సిపల్​ ఛైర్మన్​ రాజనర్సు, పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.