ఏపీ ఉపాధ్యాయుల కష్టాలు మీరు చూస్తున్నారుగా... మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు..

author img

By

Published : Sep 29, 2022, 4:56 PM IST

ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..? ()

Minister Harish Rao Comments on AP Teachers: ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులపై మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కేసులు పెట్టి లోపల వేస్తుందన్నారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని.. ఉపాధ్యాయులను ఎంతో గౌరవంగా చూసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Minister Harish Rao Comments on AP Teachers: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై కేసులు పెట్టి లోపల వేస్తుందని వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవించి 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో జరుగుతోన్న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వజ్రోత్సవ సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏ ప్రభుత్వమైనా వందకు వంద శాతం పనులు చేయడం సాధ్యం కాదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉందో.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించాలన్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై కేసులు పెట్టి లోపల వేస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం ఈ ఐదేళ్లలో ఉపాధ్యాయులకు 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులను మీరే గమనించొచ్చు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది. ఏ విధంగా కేసులు పెట్టి లోపల వేస్తుందో మీ తోటి మిత్రులతో మాట్లాడితే మీకే అర్థమవుతుంది. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఉపాధ్యాయులకు దేశంలో ఎక్కడా లేని విధంగా 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కన్నా, ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయుల కన్నా అత్యధిక వేతనాలు పొందుతుంది ఒక్క తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులే. - మంత్రి హరీశ్‌రావు

ఆ ఘనత కేసీఆర్‌దే..: ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. మిషన్ భగీరథను మెచ్చి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చి శాశ్వతంగా కరెంట్ బాధను తొలగించామన్న ఆయన.. ఈ 8 ఏళ్లలో అసెంబ్లీలో ఎప్పుడైనా కరెంట్, నీళ్ల గురించి నిరసనలు జరిగాయా ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం శాఖల వారీగా విద్యకు ఖర్చు పెడుతుందని వివరించిన మంత్రి.. రెసిడెన్షియల్ పాఠశాలల మీద ప్రభుత్వం చేసే ఖర్చు రూ.3,300 కోట్లని స్పష్టం చేశారు.

ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

ఇవీ చూడండి..

అవార్డులిచ్చారు... మరి నిధుల సంగతేంటి?: కేంద్రంపై మంత్రుల ఫైర్

'కండోమ్స్ కూడా కావాలా?'.. శానిటరీ ప్యాడ్స్ అడిగిన విద్యార్థినులకు ఐఏఎస్ సమాధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.