ETV Bharat / state

HarishRao on BRS plenary: 'ఉద్యమ జ్వాల కేసీఆర్‌.. నేడు అభివృద్ధి జ్వాలగా మారారు'

author img

By

Published : Apr 25, 2023, 4:10 PM IST

Harish Rao on BRS plenary meeting Siddipet: కేసీఆర్‌ ఎంత ఎదిగితే తెలంగాణ అభివృద్ధికి అంతా ప్రయోజనకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకుపచ్చ చరిత్ర సృష్టించారని.. ఈ యాసంగిలో దేశంలోనే అత్యధికంగా 57 లక్షల హెక్టార్లలో ధాన్యం పండిందని తెలిపారు.

Harish Rao
Harish Rao

Harish Rao on BRS plenary meeting Siddipet: ర్యాష్ట్ర వ్యాప్తంగా ఉత్సహాంగా బీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. మంత్రులు వివిధ జిల్లాలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో పాల్గొని నేతలను ఉత్సహా పరుస్తున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మోదీ, రాహుల్‌ గాంధీలపై విమర్శన అస్త్రాలు సంధించారు.

అదరగొడితే, బెదరగొడితే భయపడే నాయకుడు కేసీఆర్‌ కాదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని చేసిన రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిసి హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని ధీమ వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆకుపచ్చ చరిత్ర సృష్టించారని.. ఈ యాసంగిలో దేశంలోనే అత్యధికంగా 57 లక్షల హెక్టార్లలో ధాన్యం పండిందని తెలిపారు. మోదీ, రాహుల్‌ గాంధీలాంటి జాతీయ నాయకులకు తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా అని విమర్శించి హరీశ్‌రావు.. కేసీఆర్‌ ఎంత ఎదిగితే తెలంగాణ అభివృద్ధికి అంతా ప్రయోజనకరమని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

తెలంగాణలో కావాల్సినంత నీరు, విద్యుత్‌ ఉందని గుర్తు చేశారు. దేశంలో ఐదారు రాష్ట్రాలకు ధ్యానం ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అమలయ్యే రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపి కొట్టి పీఎం కిసాన్‌ నిధిగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఒకప్పుడు ఉద్యమ జ్వాలగా ఉన్న కేసీఆర్‌.. నేడు అభివృద్ధి జ్వాలగా మారారని ప్రశంసించారు.

BRS Plenary Meetings: ఈనెల 27న పార్టీ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి నియోజక వర్గంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉత్సహాంగా పాల్గొంటున్నారు. ఇవాళ జరిగే ప్లీనరీ సమావేశాలలో పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

"ఇవాళ రాష్ట్రంలో కావల్సినంత నీరు, విద్యుత్‌ ఉంది. ఐదారు రాష్ట్రాలకు తిండిపెట్టే ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండిస్తున్నారు. మన రైతుబంధు బాగుందని నకలు కొట్టి పీఎం కిసాన్‌ నిధి కేంద్రం అమలు చేస్తోంది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయను కేంద్రం నకలు కొట్టి వేరే పేర్లతో అమలు చేస్తోంది. అదరగొడితే, బెదరగొడితే భయపడే నాయకుడు కాదు కేసీఆర్. మహారాష్ట్ర రైతులు కేసీఆర్‌కు జేజేలు కొడుతున్నారు. కేసీఆర్‌ ఎంత ఎదిగితే.. తెలంగాణ ప్రజలకు అంత లాభం. బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్‌ కొట్టి గెలవడం ఖాయం. ఉద్యమ జ్వాల కేసీఆర్‌.. నేడు అభివృద్ధి జ్వాలగా మారారు. నిజాలను కూడా రోజూ మాట్లాడాలని అంబేడ్కర్‌ అన్నారు. నిజాన్ని రోజూ చెప్పకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది".- హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

HarishRao on BRS plenary: 'ఉద్యమ జ్వాల కేసీఆర్‌.. నేడు అభివృద్ధి జ్వాలగా మారారు'

ఇవీ చదవండి:

BRS Mini Plenary Meeting: రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగ

KTR Interview: అభివృద్ధిలో తెలంగాణ అన్‌స్టాపబుల్‌.. BRS హ్యాట్రిక్‌ ఖాయం

KTR Auto Driving: రయ్ రయ్ అంటూ.. ఆటో నడిపిన బావా బావమరిది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.