ETV Bharat / state

Harish rao about omicron: 'ఒమిక్రాన్ వచ్చేసింది.. జాగ్రత్తగా ఉండాలి'

author img

By

Published : Dec 15, 2021, 3:41 PM IST

Harish rao about omicron: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు పెరిగే అంచనాలున్నాయని... నిపుణులు సూచించిన జాగ్రత్తలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఇప్పటికే 2 ఒమిక్రాన్‌ కేసులు బయటపడినందున.... అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన హరీశ్‌.... కరోనా పట్ల ప్రజలకు పలు సూచనలు చేశారు.

Harish rao about omicron, ts omicron cases
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు

Harish rao about omicron : రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని... ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనా టీకా రెండో డోసు కూడా అందరూ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కు ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 27వ మున్సిపల్ వార్డు గణేష్ నగర్​లో రూ.15 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, 21వ వార్డు కుషాల్ నగర్​లో రూ.72 లక్షల నిధులతో నిర్మించిన నైట్ షెల్టర్, నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

కేసులు పెరిగే అవకాశం

కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కరోనా నుంచి రక్షణ పొందేందుకు ప్రజలకు పలు సూచనలు చేశారు. 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన అన్నారు. ఎలాంటి అనుమానాలు లేకుండా గర్భిణీలు సైతం వ్యాక్సిన్ తీసుకోవచ్చునన్నారు. ఆస్పత్రి వరకు రాలేని వారి కోసం ఇంటికే వచ్చి వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు.

మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలకు చెక్

గణేష్ నగర్ మహిళా భవన నిర్మాణం పదేళ్ల పంచాయతీ ఇవాళ్టితో నెరవేరిందని మంత్రి అన్నారు. ఇంకా అదనంగా కాంపౌండ్ వాల్ కోసం కావాల్సిన నిధులు, 6వ వార్డులో మహిళా భవనం మరమ్మతులకు అవసరమైన నిధులు సమకూర్చి 3 నెలల్లోపు పూర్తి చేస్తామని ఆయా వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని... రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో పట్టణంలో తాగునీటి గోస ఉండేదని... మిషన్‌ భగీరథతో నీటి కష్టాలకు చెక్‌ పడిందన్నారు.

ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు..

నల్లా నీళ్ల తరహాలో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేలా గ్యాస్ పైపు లైన్లు వేయిస్తున్నామని మంత్రి తెలిపారు. తొందరగా పైపులైన్ పనులు పూర్తి చేయించి... రోడ్లు వేసుకుందామని ప్రజలకు మంత్రి వివరించారు. యూజీడీ కోసం ప్రజలు సహకరించాలని... దోమలు, ఈగలు, రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు. సురక్షిత సిద్దిపేట కోసం పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

రెండు కేసులు వచ్చియన్. ఒమిక్రాన్ అని రెండు మన రాష్ట్రంలో మంగళవారం రాత్రి దొరికినయ్. కరోనా మళ్లీ పెరుగుతది అంటున్నారు. మరి దాని నుంచి కాపాడాలంటే రెండే తొవ్వలు ఉన్నయ్. ఒకటి మాస్కు, రెండోది కరోనా రెండు టీకాలు తీసుకోవాలి. ఒకటి సరిపోదు. బరాబర్ రెండు తీసుకోవాలి. దీంట్లో కొన్ని అనుమానాలున్నాయి. గర్భిణీలు కూడా తీసుకోవచ్చు. ఇబ్బంది లేదని డాక్టర్లు చెప్పారు. మీ దగ్గర ఎవరన్న తీసుకోకపోతే చెప్పండి. దవాఖానా దాకా రాకపోతే ఇంటికే వచ్చి టీకా ఇచ్చిపోతరు. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు.

-హరీశ్ రావు, ఆరోగ్యశాఖ మంత్రి

సిద్దిపేటలో మంత్రి హరీశ్

ఇదీ చదవండి: Omicron cases in telangana: రాష్ట్రంలోకి ఒమిక్రాన్ ఎంట్రీ.. హైదరాబాద్​లో 2 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.