ETV Bharat / state

స్ట్రాంగ్​రూమ్​ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

author img

By

Published : Nov 3, 2020, 10:25 AM IST

District Electoral Officer visiting Strong Room in siddipet district
స్ట్రాంగ్​రూమ్​ను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి

ప్రతి రెండు గంటలకు పోలింగ్​ శాతం నివేదికలను పంపాలని ఎన్నికల అధికారులను జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి ఆదేశించారు. దుబ్బాక మండలంలోని లచ్చపేటలోని స్ట్రాంగ్​రూమ్​ను ఆమె పరిశీలించారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలోని స్ట్రాంగ్​రూమ్​ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ భారతి హోళికేరి పరిశీలించారు. ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్​లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ బోర్డులో పోలింగ్ కేంద్రాల వారీగా నియోజకవర్గ పరిధిలోని 104 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.

ఇవీ చూడండి: 'కాంగ్రెస్‌లోనే ఉంటానని నా తండ్రిపై ప్రమాణం చేశాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.