ETV Bharat / state

కలెక్టర్​ కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ నాయకుల ధర్నా

author img

By

Published : Jun 29, 2020, 4:24 PM IST

డీజిల్, పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ నాయకులు ధర్నా నిర్వహించారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్​ చేశారు.

congress leaders protest in front of collectorate at siddipeta
కలెక్టర్​ కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ నాయకుల ధర్నా

పెరిగిన పెట్రోల్​ డీజిల్​ ధరలను నిరసిస్తూ సిద్దిపేటలోని జాయింట్ కలెక్టర్ పద్మాకర్​కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెరిగిన ధరలతో పేద ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని.. కరోనా కష్టకాలంలో మోదీ సర్కార్​ ధరలు పెంచడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించాలని వారు కోరారు.

ఇవీ చూడండి: హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.