ETV Bharat / state

శుభకార్యానికి వెళ్లొచ్చే లోపు దోచేశారు..

author img

By

Published : Nov 2, 2019, 3:32 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం అర్ధరాత్రి సిద్దేశ్వర బుక్ షాపులో 20వేల నగదు చోరీ జరిగిందని సమాచారం.

శుభకార్యానికి వెళ్లొచ్చే లోపు దోచేశారు..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పంజా విసిరారు. సిద్దేశ్వర బుక్ షాపు తాళం పగలకొట్టి 20 వేల నగదును దోచుకెళ్లారు. యజమాని ఓ శుభకార్యానికి హైదరాబాద్​ వెళ్లొచ్చి చూసేసరికి ఈ చోరీ జరిగింది. షాపులోని 20 వేల నగదు దోచుకెళ్లారని బాధితులు చెబుతున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల హుస్నాబాద్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాళం వేసి ఊర్లకు వెళ్లాలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

శుభకార్యానికి వెళ్లొచ్చే లోపు దోచేశారు..

ఇదీ చూడండి : కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం...

Intro:TG_KRN_101_02_VARUSA CHORILU_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-------------------------------------------------------------బుక్ స్టాల్ లో చోరీ 20,000 అపహరణ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం అర్ధరాత్రి సిద్దేశ్వర బుక్ స్టాల్ లో చోరీ జరిగింది. బుక్ స్టాల్ యజమానులు ఓ శుభకార్యానికి హాజరు కావడానికి దుకాణానికి తాళం వేసి హైదరాబాద్ కు వెళ్లారు. ఊరికి వెళ్ళే క్రమంలో 20 వేల నగదును దుకాణంలోని గళ్ళలో వదిలి వెళ్లారు. షాపుకు తాళం వేసి ఉండడంతో అదే అదునుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేస్ నమోదు చేసుకొని, క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల హుస్నాబాద్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇండ్లలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి, తాళం వేసి ఎటైనా వెళ్లలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోConclusion:వరుస చోరీలు, భయాందోళనలో ప్రజలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.