ETV Bharat / state

అర్ధరాత్రిళ్లు భల్లూకం సంచారం... భయంలో స్థానికులు

author img

By

Published : Feb 10, 2020, 9:22 PM IST

BEAR WANDERING ON MID NIGHT AT CCPALLI IN SIDDIPET DISTRICT
BEAR WANDERING ON MID NIGHT AT CCPALLI IN SIDDIPET DISTRICT

అర్ధరాత్రి దాటిందంటే చాలు... ఆ ఊర్లోకి భల్లూకం బయలుదేరుతోంది. వేకువజాము వరకూ వీధుల్లో తిరుగుతోంది. ఇందతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ దృశ్యాలు చూసి స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సీసీపల్లిలో ఎలుగుబంటి సంచారం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి సమయంలో ఎలుగుబంటి సంచారం చేయడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. రెండు మూడు రోజులుగా అర్ధరాత్రి దాటిన మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ఎలుగుబంటి వచ్చే సమయంలో కుక్కలు మొరుగటం వల్ల స్థానికులు ఒకరికొకరు ఫోన్ల ద్వారా బయటికి రావొద్దని హెచ్చరించుకుంటున్నట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని గ్రామంలోకి రాకుండా నివారించాలని కోరుతున్నారు.

అర్ధరాత్రిళ్లు భల్లూకం సంచారం... భయంలో స్థానికులు

ఇదీ చూడండి: వేడుకలో పరిచయం.. వంచించి సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.