ETV Bharat / state

వేడుకలో పరిచయం.. వంచించి సామూహిక అత్యాచారం

author img

By

Published : Feb 8, 2020, 11:58 PM IST

శుభకార్యానికి వచ్చిన అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు. కేటరింగ్​ చేసుకునే కుర్రాడు కుటిల పన్నాగం పన్నాడు. అమాయకునిలా నటించి మాయమాటలు చెప్పాడు. ఇంటి వరకూ రప్పించుకున్నాడు. నమ్మి వచ్చిన యువతిని అసహాయురాలిని చేసి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ పాశవిక చర్యలో ఆరుగురు నిందితులు పాల్గొనగా.. అందరూ మైనర్లే కావటం గమనార్హం.

6 MINOR BOYS RAPED A LADY AT MAHABOOBABAD
6 MINOR BOYS RAPED A LADY AT MAHABOOBABAD

మహబూబాబాద్‌ జిల్లాలోని ఓ గిరిజన తండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వేడుకలో ఏర్పడిన పరిచయం కాస్తా... సామూహిక అత్యాచారానికి దారితీసింది. అమనగల్‌ శివారులోని ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు వేడుకల్లో కేటరింగ్​ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన ఓ యువతి హైదరాబాద్​లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి వచ్చింది. అదే వేడుకకు క్యాటరింగ్​ చేస్తున్న బాలునితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోన్​ నంబర్లు తీసుకుని మాట్లాడుకోసాగారు. చనువు పెరగటం వల్ల తన ఇంటికి రావాలని యువతిని బాలుడు ఆహ్వానించాడు.

నమ్మించి.. తోటకు తీసుకెళ్లి...

ఇంటికి వచ్చేందుకు ఒప్పుకున్న యువతి శుక్రవారం రోజున సికింద్రాబాద్‌ నుంచి గోల్కొండ రైలులో మహబూబాబాద్‌కు వచ్చింది. ఆటోలో తండాకు చేరుకుంది. బాలున్ని కలుసుకోగా... ఏవో మాయమాటలు చెప్పి మామిడి తోటకు తీసుకెళ్లాడు. తండాకు చెందిన ఇద్దరు, మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు, తొర్రూరుకు చెందిన ఓ బాలుడు కలిసి పథకం ప్రకారం యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆరుగురూ మైనర్లే...

రాత్రి పది గంటల సమయంలో యువతి అరుపులు విన్న ఓ వ్యక్తి... నిందితులను పట్టుకుని గ్రామస్థులకు విషయాన్ని తెలిపాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆరుగురు నిందితులతో పాటు యువతిని సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె నుంచి వాంగ్మూలం స్వీకరించిన పోలీసులు... ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వేడుకలో పరిచయం.. వంచించి సామూహిక అత్యాచారం

ఇదీ చూడండి: మేడారం ఏర్పాట్లపై గవర్నర్, సీఎం ప్రశంసల జల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.