ETV Bharat / state

ఆక్సిజన్ తయారీ పరిశ్రమను పరిశీలించిన ఎస్పీ

author img

By

Published : May 14, 2021, 10:23 PM IST

ఆక్సిజన్ తయారీ పరిశ్రమను పరిశీలించిన ఎస్పీ
ఆక్సిజన్ తయారీ పరిశ్రమను పరిశీలించిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఐనాక్స్ ఆక్సిజన్ పరిశ్రమను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి పరిశీలించారు. పరిశ్రమకు భద్రత కల్పించాలని సూచించారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఐనాక్స్ ఆక్సిజన్ తయారీ పరిశ్రమను సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఆక్సిజన్ తయారీ కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతమేరకు ఎవరెవరికి అందిస్తున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆక్సిజన్ అవసరమైన చోట అందించాలని సూచించారు. బయట నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రత కల్పించాలని భానూరు పోలీసులను ఆదేశించారు. దీంతో భానూరు పోలీసులు పరిశ్రమ వద్ద పోలీస్ సిబ్బందితో పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్ర సరిహద్దులో ఏపీ అంబులెన్స్​ల నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.