మంజీరా పైప్లైన్ పగిలింది.. దుకాణాల్లోకి నీరు చేరింది

మంజీరా పైప్లైన్ పగిలింది.. దుకాణాల్లోకి నీరు చేరింది
Pipeline burst in Ramachandrapuram: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో మంజీరా పైప్లైన్లు రెండుచోట్ల పగిలిపోయాయి. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. భారీగా విరజిమ్మిన నీరు సమీపంలోని దుకాణాల్లోకి వచ్చి చేరింది. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు నీటి సరఫరా నిలిపివేయించి మరమ్మతులు చేపట్టారు.
Pipeline burst in Ramachandrapuram: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో ఒకేసారి రెండుచోట్ల మంజీరా పైప్లైన్లు పగిలిపోయాయి. దీంతో భారీగా తాగునీరు వృథా అయింది. భారీగా విరజిమ్మిన నీరు సమీపంలోని దుకాణాల్లోకి వచ్చి చేరింది. వరద నీటితో దుకాణంలోని వస్తువులు తడిసిపోయాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే లింగంపల్లి కూడలి సమీపంలో పైపులైన్ పగిలి పెద్ద ఫౌంటెన్ను తలపించింది. దీనికి తోడు నీరు రహదారిపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు వెంటనే నీటి సరఫరా నిలిపివేయించి మరమ్మతులు చేపట్టారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: అమర జవాన్ల త్యాగం వెలకట్టలేనిది: సీఎం కేసీఆర్
తోపుడుబండిపై గర్భిణీ.. కష్టపడి ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్, నర్స్ ఆబ్సెంట్
