ETV Bharat / state

Mallikarjun Kharge Speech in Congress Public Meeting : మిగులు రాష్ట్రాన్ని.. కేసీఆర్​ సీఎం అయి అప్పుల పాలు చేశారు : ఖర్గే

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 5:11 PM IST

Congress Public Meeting
Mallikarjun Kharge Speech in Congress Public Meeting

Mallikarjun Kharge Speech in Congress Public Meeting at Sangareddy : తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రమని.. తొమ్మిదేళ్ల కేసీఆర్​ పాలనలో అప్పులపాలు అయిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపణలు చేశారు. గతంలో కాంగ్రెస్​ ఇచ్చిన హామీలను అన్నీ అమలు చేశామని.. ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన కాంగ్రెస్​ విజయభేరి యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.

Mallikarjun Kharge Speech in Congress Public Meeting at Sangareddy : గతంలో కాంగ్రెస్​ ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిందని.. ఇప్పుడు కూడా ఇచ్చిన ఆరు గ్యారెంటీ(Congress Six Guarantees)లను నెరవేరుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రమని.. తొమ్మిదేళ్ల కేసీఆర్​ పాలనలో అప్పులపాలు అయిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన కాంగ్రెస్​ విజయభేరి యాత్ర(Telangana Congress Bus Yatra)లో భాగంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొని.. బీఆర్​ఎస్​, బీజేపీలపై విమర్శలు చేశారు.

బీఆర్​ఎస్​ చేసిన రూ.5 లక్షల కోట్ల అప్పుల వల్ల ప్రతి ఒక్కరిపై రూ. 1.50 లక్షల అప్పు పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నో జాతీయ సంస్థలను నెలకొల్పిందన్నారు. కాంగ్రెస్​ స్థాపించిన సంస్థలతో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల వారి ఖాతాల్లో రూ.2500 వేస్తామని మల్లికార్జున ఖర్గే మాటిచ్చారు. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ.500 బోనస్​ ఇస్తామన్నారు. విద్యార్థులకు యువ వికాసం కింద చదువులు కోసం రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు.

DK Shivakumar Speech in Congress Bus Yatra : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పట్ల కృతజ్ఞత చూపాలి : డీకే శివకుమార్​

Mallikarjun Kharge Fires on PM Modi and CM KCR : మోదీ పాలనలో కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని.. ఈ తొమ్మిదేళ్లలో అదానీ ఆదాయం మాత్రమే రెట్టింపు అయిందని ఖర్గే అన్నారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​కు బీ టీం ఎవరో ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు మేలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వాలకు లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు, పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ గొప్పగా చెప్పుకున్నారని విమర్శించారు. కేసీఆర్​, మోదీ ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే కేసీఆర్​, మోదీ ఇచ్చిన హామీలు మరిచిపోయారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తేనే.. నిత్యావసరాల ధరలు తగ్గుతాయని వివరించారు.

Revanth Reddy Challenge to KCR : 'కర్ణాటకలో అమలు అవుతున్న పథకాలు చూసేందుకు సిద్ధమా?'

Ticket Clashes in Telangana Congress : కాంగ్రెస్​లో భగ్గుమంటున్న అసమ్మతి జ్వాలలు.. బరిలో నిలిచి తీరుతామంటున్న ఆశావహ నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.