ETV Bharat / state

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​... మరో రెండు నోటిఫికేషన్లు వచ్చేశాయ్​

author img

By

Published : Apr 28, 2022, 6:14 PM IST

Updated : Apr 28, 2022, 7:52 PM IST

Notification for Constable Jobs in Excise and Transport Department
ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్టు శాఖలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

18:12 April 28

ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్టు శాఖలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Notification for Constable in Excise and Transport: రాష్ట్రంలో మరో రెండు విభాగాల్లో పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోలీసు రవాణా విభాగం, ఎక్సైజ్‌ శాఖలో కలిపి 677 కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఎక్సైజ్‌ శాఖలో 614 పోస్టులు, పోలీసు రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

పోలీసు శాఖతో పాటు ఎస్పీఎఫ్‌, అగ్నిమాపక, జైళ్ల శాఖలో 16,614 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు నాలుగు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా మే 2 నుంచి 20వ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాల వారీగా విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్‌ తదితర వివరాలు వెబ్‌సైట్లో పొందుపరిచామని తెలిపారు. యూనిఫాం పోస్టులకు ఈ నోటిఫికేషన్లోనూ మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలింపు కల్పించింది.

ఇవీ అర్హతలు...ఎస్సై పోస్టులు...

  • 2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 1997 జులై 2 కంటే ముందు, 2001 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిలో 3 ఏళ్ల సడలింపునిచ్చారు.
  • దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం డిగ్రీ అర్హత ఉండాలి.
  • ఎస్సైతోపాటు స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాలకు ఓసీ, బీసీ కులాలకు చెందిన స్థానిక అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ స్థానికులైతే రూ.500, స్థానికేతరులైతే అన్ని కులాలవారూ రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

కానిస్టేబుల్‌, ఫైర్‌మెన్‌, వార్డర్‌ ఉద్యోగాలు...

  • 2022 జులై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 2000 జులై 2 కంటే ముందు... 2004 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు.
  • రెండేళ్ల కాలంలో కనీసం 365 రోజులు విధులు నిర్వర్తించి, ఇప్పటికీ కొనసాగుతున్న హోంగార్డులైతే కనీసం 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. 40 ఏళ్లు దాటకుండా ఉండాలి.
  • మహిళా కానిస్టేబుల్‌ (సివిల్‌, ఏఆర్‌), మహిళా వార్డర్లకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చారు. వితంతువులు, చట్టపరంగా భర్త నుంచి విడాకులు పొంది, మళ్లీ పెళ్లి చేసుకోని వారిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే 18 ఏళ్లు నిండి, 40 ఏళ్లు మించకుండా ఉండాలి. మిగతా అన్ని కులాల్లో 18 - 35 మధ్య వయసున్న వారు అర్హులు.
  • కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌
  • ఓసీ, బీసీ కులాలకు చెందిన స్థానికులైతే రూ.800, ఎస్సీ, ఎస్టీలయితే రూ.400, స్థానికేతరుతైలే కులాలతో సంబంధం లేకుండా రూ.800 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌, ఏఎస్సై ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో...

  • 2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
  • ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీలో ఎస్సై ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎలక్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేమేషన్‌ టెక్నాలజీ విభాగాల్లో దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
  • పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌లో ఎస్సై ఉద్యోగాలకు ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో రాష్ట్ర సాంకేతిక విద్యామండలి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తత్సమానమైన విద్యా సంస్థ నుంచి డిప్లొమా పొంది ఉండాలి.
  • ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలో ఏఎస్సై ఉద్యోగాలకు కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌, ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • ఓసీ, బీసీ కులాలకు చెందిన స్థానికులైతే రూ.1000, ఎస్సీ, ఎస్టీలయితే రూ.500, స్థానికేతరులైతే కులాలతో సంబంధం లేకుండా రూ.1000 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
  • పోలీసు ఉద్యోగాలు అన్నిటికీ ప్రభుత్వం 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. అన్ని ఉద్యోగాలకు 2022 జులై 1వ తేదీ నాటికి సంబంధిత విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఇవీ చదవండి: Kishan Reddy On Kcr: 'కేసీఆర్‌.. ఫ్రంట్‌లు, టెంట్‌లు పెట్టుకోవచ్చు'

ఐపీఎల్​లో ఆ ప్లేయర్ల హవా... టీమ్ఇండియాకు మళ్లీ ఆడతారా?

Last Updated :Apr 28, 2022, 7:52 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.