Gaddi Annaram Fruit Market: బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో దసరా నుంచి కొనుగోళ్లు : మంత్రి నిరంజన్​రెడ్డి

author img

By

Published : Oct 11, 2021, 11:34 AM IST

Updated : Oct 11, 2021, 11:46 AM IST

Gaddi Annaram Fruit Market

గడ్డిఅన్నారం పండ్లమార్కెట్​(Gaddi Annaram Fruit Market)ను తాత్కాలికంగా నిర్వహించేందుకు బాటసింగారం లాజిస్టిక్స్ పార్కు, కొత్తపేటలోని కొత్తపేట విక్టోరియా హోమ్ స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. బాటసింగారం లాజిస్టిక్ పార్కులో తాత్కాలికంగా పండ్ల మార్కెట్ నిర్వహించాలని మార్కెటింగ్ శాఖ ప్రతిపాదించింది. బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని వెల్లడించారు.

గడ్డి అన్నారం మార్కెట్‌ తాత్కాలిక నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో దసరా నుంచి కొనుగోళ్లు జరుగుతాయని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అదే రోజున కోహెడలో వర్తకులకు ఇచ్చే స్థలాల్లో నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు కొత్తపేటలోని విక్టోరియా హోమ్ స్థలాన్ని మంత్రులు నిరంజన్‌ రెడ్డి, మహమూద్‌ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. కొత్తపేట విక్టోరియా హోమ్ స్థలంలోని మైదానాన్ని పరిశీలించిన మంత్రులను కమీషన్ ఏజెంట్లు తమ ఇబ్బందులను వివరించారు.

కోహెడలో మౌలికసదుపాయాలు కల్పించే వరకు బాటసింగారంలో కొనసాగిస్తామని ఇప్పటికే ప్రతిపాదించారు. అయితే తాత్కాలికంగా మార్కెట్ నిర్వహణకు బాటసింగారానికి బదులుగా కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ - వీఎంహోం ప్లేగ్రౌండ్​లో కొనసాగించాలని మజ్లిస్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో తాత్కాలిక పండ్ల మార్కెట్ కోసం విక్టోరియా ప్లే గ్రౌండ్​తో పాటు బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్ రెండు స్థలాలను పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ మార్కెట్​ను పరిశీలించారు.

గడ్డిఅన్నారం మార్కెట్‌ తాత్కాలిక నిర్వహణపై ప్రభుత్వం దృష్టి

బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. దసరా రోజునే కోహెడలో నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతాం. అటు వర్తకులతో, వ్యాపారులతో మాట్లాడి... అక్కడికి వెళ్లి చూశాకే నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఉద్దేశాన్ని, సంకల్పాన్ని ఎంఐఎం కూడా అంగీకరించింది. గడ్డి అన్నారంలో త్వరలో సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిని కేసీఆర్ ప్రారంభిస్తారు. కోహెడకు వెళ్లే లోపల బాటసింగరంలో వసతులేమి లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేం చర్యలు తీసుకుంటాం. సజావుగా వర్తకం నడిచేలా చూస్తాం. పండ్ల వ్యాపారులకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది.

- మంత్రి నిరంజన్​రెడ్డి

అందరికీ అనువైన ప్రదేశంలోనే ఫ్రూట్ మార్కెట్: మంత్రి నిరంజన్​రెడ్డి

ఇదీ చూడండి: Gaddiannaram Fruit Market: దశాబ్దాల గడ్డి అన్నారం మార్కెట్‌ చరిత్రకు తెర

Last Updated :Oct 11, 2021, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.