ETV Bharat / state

'తెరాస హయాంలో మహిళలకు పెద్దపీట'

author img

By

Published : Mar 9, 2021, 12:36 AM IST

సీఎం కేసీఆర్​ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల తెరాస అభ్యర్థి వాణీదేవికి మహిళలు అండగా నిలవాలన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కర్మాన్​ఘాట్​లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

minister sabitha Indra reddy participated in international womens day in karman ghat in rangareddy district
'తెరాస హయాంలో మహిళలకు పెద్దపీట'

మహిళలకు మేయర్​, ఉపమేయర్ పదవులు ఇచ్చిన ఘనత తెరాసదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. వారి సంక్షేమం కోసం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, వితంతు పెన్షన్​ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కర్మాన్​ఘాట్​లోని చంద్ర గార్డెన్​లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

ఈ నెల 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి కోరారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, తెరా అభ్యర్థి వాణీదేవి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఎన్నికల ప్రచారం: ఎత్తుకు పైఎత్తులతో ఓటర్ల ప్రసన్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.