ETV Bharat / state

మూడు నెలల చిన్నారికి ఉరేసి.. ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య

author img

By

Published : Apr 4, 2023, 10:30 PM IST

comitted suicide
comitted suicide

Husband And Wife Suicide In Ranga Reddy: పాపం ఆ తల్లిదండ్రులకు ఎంత కష్టం వచ్చిందో ఏమో.. మూడు నెలల చిన్నారి అని చూడకుండా తన పాపతో కలిసి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది. ఈ హృదయ విషాదాన్ని మిగిల్చే ఘటనతో అందరూ కన్నీరు మున్నీరయ్యారు.

Husband And Wife Suicide In Ranga Reddy: వారిద్దరూ ఇష్టపడి ప్రేమించి.. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిచ్చారు. ఇంతలో ఏమీ జరిగిందో తెలియదు.. మంగళవారం తెల్లవారుజామున మూడు నెలల చిన్నారిని తాడుతో ఉరివేసి ఆతర్వాత తల్లిదండ్రులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరంపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు, లక్ష్మీలకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. కొడుకులు అశోక్ (25), రఘవేందర్‌లు ఇద్దరు వ్యవసాయం చేస్తూ ట్రాలీ ఆటో కొనుగోలు చేసి గ్రామంలోని కూరగాయలను నగరంలోని మార్కెట్ తరలించడం, కిరాయికి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం అశోక్ ఆలూరు గ్రామానికి చెందిన అంకిత(21)ను ప్రేమించాడు. ఇద్దరి ఇళ్లలో ఒప్పించి వివాహం చేసుకున్నారు. వారు మూడు నెలల క్రితం ఓ పాప జన్మనిచ్చారు. అప్పటి నుంచి భార్య తల్లిగారి ఇంటి వద్దనే ఉంది. ఇటీవల అశోక్ చెల్లిలి వివాహం నిశ్చయం కావడంతో శుక్రవారం నిశ్చితార్థం ఉండటంతో గురువారం నాడు అంకిత పాపను తీసుకొని వచ్చింది. శుభకార్యం కూడా బాగానే జరిగింది.

మూడు నెలల చిన్నారికి సైతం: సోమవారం ఎప్పటి మాదిరిగానే అన్నదమ్ములు గ్రామంలోని రైతులు సాగు చేసిన కూరగాయలను ఆటోలో వేసుకొని నగరంలోని మార్కెట్‌కు వెళ్లారు. తిరిగి గ్రామానికి బయలు దేరుతూ మార్గ మధ్యలో భార్య కోసం అశోక్ బిర్యాని తీసుకున్నాడు. తెల్లవారు జామూన నాలుగు గంటలకు ఇద్దరు వచ్చారు. అశోక్ భార్యతో కలిసి భోజనం చేస్తుండగా తమ్ముడు, తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. భార్య భర్తలు ఇద్దరు ఇంట్లోకి వెళ్లి టీవీ పెద్దగా వాల్యూం పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మొదట చిన్నారిని దూలానికి ఉరివేసి తర్వాత భార్య భర్తలు ఉరివేసుకున్నారు. ఆరు గంటల సమయంలో ఇంట్లో టీవీ సౌండ్ పెద్దగా రావడం.. బయటకు ఇద్దరు రాకపోవడంతో అనుమానం వచ్చి ఎంత పిలిచిన తలుపులు తీయలేదు. తలుపులను బలంగా తోసి తీయగా తల్లీకూతురు మృతి చెందగా అశోక్‌ కొన ఊపిరితో కొట్టుకుట్టున్నాడు. తాడు ఇప్పి కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందాడు.

గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అయూబ్ చేరుకున్నారు. పంచినామ నిర్వహించి మృత దేహాలను ఆటోలో చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఆత్మహత్యలకు గల బలమైన కారణం ఏమిటి.. భార్యభర్తలు మూడు నెలలు చిన్నారిని ఉరివేసి.. ఆతర్వాత వారు కూడా ఉరి వేసుకోవడానికి గల బలమైన కారణం ఏంటని ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. కుటుంబంలోని గొడవలే కారణమా.. లేక ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా ఎలాంటి సమస్యలు లేనట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.