ETV Bharat / state

ప్రభుత్వ కళాశాలలో.. 700 మంది విద్యార్థినులకు ఒక్కటే మరుగుదొడ్డా?

author img

By

Published : Mar 3, 2023, 9:38 AM IST

ts high court
తెలంగాణ హైకోర్టు

Hc On Govt Educational Insititutions Facilitites: సరూర్‌ నగర్‌లో 700 విద్యార్థినులకు ఒక్కటే మరుగుదొడ్డి ఉండడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతులు మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. సరూర్‌నగర్‌ జూనియర్‌ కళాశాలతోపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్ విద్య కమిషనర్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

High Court Questioned Govt Regarding Government Educational Institutions: ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతుల మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కనీస వసతులు లేవంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారంటూ ఓ పత్రికలో ప్రచురితమైనన కథనాన్ని చేస్తూ ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్‌ రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. సరూర్‌నగర్‌లోని ప్రభుత్వ కాలేజ్‌లో 700 మంది విద్యార్థినులకు ఒకే ఒక్క పనిచేయని ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉండటంతో హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయంపై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన మణిదీప్‌ రాసిన లేఖలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని లేఖలో రాశారు. ఒకే మరుగుదొడ్డి ఉండడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారని.. రుతుక్రమం సమయంలో కాలేజ్‌కు రావడానికి ఇష్టపడడం లేదని.. ఒకవేళ వచ్చినా అందుకు తగిన మాత్రలు మాత్రలు వాడుతున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో గత మూడు నెలలుగా విద్యార్థులు అధికారులకు లేఖ రాసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. వారు పట్టించుకోకపోవడం వల్ల దాదాపు 300 మందికి పైగా సరూర్‌నగర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు తమ తరగతులను బహిష్కరించారని తెలిపారు.

అదే కళాశాలలోని బాలురు కూడా సరైన మరుగుదొడ్డి వసతులు లేక బయటకు పోతున్నారని చెప్పారు. ఎన్నిసార్లు అధికారులకు లేఖలు రాసిన పట్టించుకోకపోవడంతో.. మానవహక్కుల కమిషన్‌కు లేఖ రాశానని ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్‌ వెల్లడించారు. అయితే అక్కడ కూడా ఛైర్మన్‌, సభ్యులు లేకపోవడంతో హైకోర్టుకు నేరుగా లేఖ రాశానన్నారు. సుమోటోగా స్వీకరించిన ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణకు తీసుకుంది.

700 మందికి విద్యార్థినులకు ఒక్కటే మరుగుదొడ్డి: సరూర్‌నగర్‌లోని ప్రభుత్వ కాలేజ్‌లో 700 మంది విద్యార్థినులకు ఒకే ఒక్క పనిచేయని మరుగుదొడ్డి ఉండటంతో సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్యం చేశారు. ప్రభుత్వం విద్యాసంస్థల్లో అమ్మాయిలకు తగిన వసతులు కల్పించాలని వ్యాఖ్యానించారు. దీనివల్ల మరింత మంది ఆడపిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ విషయాలపై ప్రభుత్వ న్యాయవాదిని పలు ప్రశ్నలు అడిగారు.

విచారణ ఏప్రిల్‌ 25కు వాయిదా: ప్రతివాదులుగా చేర్చిన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు, సరూర్‌నగర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌తో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థను ప్రతివాదిగా చేర్చుతూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కళాశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు, మరుగుదొడ్లులలో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న చర్యలపై తగిన పూర్తి వివరాలతో నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 25కు వాయిదా వేసింది. ఈ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కాలేజీల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 25వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.