ETV Bharat / health

'ఇండియన్స్ ఈ ఫుడ్​ ఐటమ్స్​కు దూరంగా ఉంటే చాలు- డయాబెటిస్​కు ఈజీగా చెక్ పెట్టొచ్చు' - ICMR Dietary Guidelines For Indians

author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 5:41 PM IST

ICMR Dietary Guidelines For Indians
ICMR Dietary Guidelines For Indians (ANI)

ICMR Dietary Guidelines For Indians : భారతీయులు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చో హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) తెలిపింది. ఈ అంశంపై ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు లోతుగా రీసెర్చ్ చేసి 17 ఆహారపరమైన మార్గదర్శకాలను రూపొందించారు. ఈ వివరాలను 'డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్' పేరుతో విడుదల చేసింది.

ICMR Dietary Guidelines For Indians : వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు, తగిన శరీర బరువును మెయింటైన్ చేసేందుకు పాటించాల్సిన పోషకాహార ప్రణాళికను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) దీనికి సంబంధించిన సూచనలను 'డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్' పేరుతో విడుదల చేసింది. భారతీయులు ఏయే ఆహారపరమైన మార్గదర్శకాలను పాటిస్తే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ బారిన పడకుండా ఉండచ్చో ఈ నివేదిక తెలిపింది. ఉప్పు, చక్కెర, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలని ఎన్ఐఎన్ సూచించింది. శరీర బరువును పెంచుకునేందుకు ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవద్దని హెచ్చరించింది.

అది వాడారో కిడ్నీలు, ఎముకలపై ఎఫెక్ట్
నూతన పోషకాహార ప్రణాళికను ఐసీఎంఆర్- ఎన్ఐఎన్ అంత ఆషామాషీగా రూపొందించలేదు. ఇందుకోసం ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత నేతృత్వంలోని నిపుణులతో కూడిన టీమ్ లోతైన రీసెర్చ్ చేసింది. అనేక శాస్త్రీయ అంశాలను సమీక్షించిన అనంతరం అందరూ తప్పకుండా పాటించాల్సిన 17 ఆహారపరమైన మార్గదర్శకాలను ఎన్ఐఎన్ జారీ చేసింది. వీటిలో ప్రధానంగా ప్రొటీన్ పౌడర్ల గురించి ప్రస్తావించారు. ప్రొటీన్ పౌడర్లను అతిగా వాడితే మన ఎముకలలోని మినరల్స్ తొలగిపోతాయని, మూత్రపిండాలు దెబ్బతినే రిస్క్ కూడా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.

ఎన్ఐఎన్ చెప్పిన సూచనలివీ

  • శరీరానికి శక్తిని (కేలరీలను) అందించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. శరీరానికి చక్కెరల ద్వారా అందించే కేలరీలు 5 శాతంలోపే ఉండాలి.
  • తృణధాన్యాలు, మిల్లెట్ల నుంచి 45 శాతంలోపు కేలరీలను పప్పులు, బీన్స్, మాంసం నుంచి 15 శాతం వరకు కేలరీలను శరీరానికి అందించవచ్చు.
  • శరీరానికి అవసరమైన మిగిలిన కేలరీలను డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పండ్లు, పాల నుంచి పొందాలి.
  • శరీరానికి అందించే మొత్తం కేలరీలలో 30 శాతంలోపే కొవ్వు సంబంధిత ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తులు ఉండాలి.
  • పప్పుధాన్యాలు, మాంసం ధరలు మండిపోతుండటం వల్ల దేశ ప్రజలు ఎక్కువగా తృణధాన్యాలనే ఆహారంలో వినియోగిస్తున్నారని ఎన్ఐఎన్ తెలిపింది. దీనివల్ల శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ అందడం లేదు. ఫలితంగా జీవక్రియల్లో అంతరాయం ఏర్పడుతోంది. వెరసి చిన్న వయసులోనే ఎంతోమంది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతతో ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
  • మన దేశంలో ఇన్సులిన్ సంబంధిత వ్యాధుల బారినపడుతున్న వారిలో 56.4 శాతం మంది ఆరోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారమే కారణమని నివేదిక పేర్కొంది.
  • ఆరోగ్యకరమైన ఆహారం, తగిన శారీరక శ్రమ వల్ల గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ వంటివి అలుముకునే ముప్పు చాలా వరకు తగ్గుతుంది. టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా దాదాపు 80 శాతం వరకు తగ్గిపోతుందని ఎన్ఐఎన్ చెప్పింది.
  • ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల అకాల మరణాలను కూడా నివారించవచ్చని తెలిపింది.
  • చక్కెరలు, కొవ్వులు, ప్రాసెస్ చేయబడిన ఫుడ్స్, శారీరక శ్రమ తగ్గడం వల్ల ఊబకాయం వంటి సమస్యలతో యువత బాధపడుతున్నారని ఎన్ఐఎన్ నివేదిక వెల్లడించింది.

సరిగ్గా నిద్రపోకపోతే కంటి ఆరోగ్యం షెడ్డుకే? ఇవి పాటిస్తే బిగ్​ రిలీఫ్! - Impact Of Sleep On Eye Health

రోజూ ఉదయం బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఎన్ని లాభాలో తెలుసా? వెయిట్ లాస్ పక్కా! - Black Coffee Benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.