ETV Bharat / state

వృద్ధురాలికి కానిస్టేబుల్ ప్లాస్మాదానం

author img

By

Published : Jan 5, 2021, 10:27 AM IST

కరోనా సోకిన బాధితులకు రాచకొండ పోలీసులు అండగా నిలుస్తున్నారు. వారికి మనోధైర్యాన్నిస్తూ... ఆపత్కాలంలో ప్లాస్మాదానం చేయడానికి ముందుకొస్తున్నారు.

వృద్ధురాలికి ప్లాస్మాదానం చేసిన కానిస్టేబుల్
వృద్ధురాలికి ప్లాస్మాదానం చేసిన కానిస్టేబుల్

ప్లాస్మాదానం చేసి ఓ వృద్ధురాలి ప్రాణం నిలబెట్టారు కానిస్టేబుల్. హైదరాబాద్ మలక్​పేట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 75 సంవత్సరాల శ్రీదేవమ్మకు కానిస్టేబుల్ సురేందర్ ప్లాస్మా దానం చేశారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్​నగర్ పీఎస్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న సురేందర్ ప్లాస్మా దానం చేసి ప్రాణాన్ని కాపాడారు. సురేందర్​కు పేషెంట్ తరఫు బంధువులు ధన్యవాదాలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.