ETV Bharat / state

ధరణి పోర్టల్​ రద్దు చేయాలని.. కాంగ్రెస్​ శ్రేణుల ధర్నా

author img

By

Published : Nov 30, 2022, 10:27 PM IST

Congress strike to cancel Dharani portal: ధరణి పోర్టల్​ పేదలకు, దళితులకు శాపంగా మారిందని కాంగ్రెస్​ శ్రేణులు పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్​ శ్రేణులు ధర్నాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధరణి పోర్టల్ రద్దు చేయాలని కాంగ్రెస్​ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు.

Congress strike to cancel Dharani portal
ధరణిని రద్దు కోరుతూ కాంగ్రెస్​ ధర్నా

Congress strike to cancel Dharani portal: ధరణి పోర్టల్​ను రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్​ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని తహశీల్దార్​ కార్యాలయాలను ముట్టడించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధరణి పోర్టల్ రద్దు చేయాలని కాంగ్రెస్​ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం మండల అధ్యక్షుడు కాకి ఈశ్వర్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొని ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

ధరణి పోర్టల్ దళితులకు, పేదలకు శాపంగా మారిందని మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచిపెడితే.. టీఆర్​ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో బలవంతంగా ఆ భూములను బలవంతంగా వెనక్కి లాక్కోవడం జరుగుతోందని ఆయన తెలిపారు. కొన్ని భూములను ధరణిలో చేర్చకుండా వేధింపులకు గురి చేయడం సరికాదని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో భూమి ఉన్న ప్రతి వ్యక్తి ధరణి పోర్టల్​తో ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పాసు పుస్తకాల పేరుతో ఉన్న భూమిని లాగేసుకునేందుకు చేసే ప్రయత్నమే ధరణి అని ఎద్దేవా చేశారు.

ధరణి పోర్టల్​ని రద్దుచేసి పాత విధానంలోనే రైతులకు ఇబ్బందులు లేని పరిస్థితి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలకు ఎనలేని సేవలు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, పేద ప్రజల ఆరోగ్యం పట్ల, విద్య పట్ల బాధ్యత తీసుకొని ఎన్నో విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు కట్టించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, నాయకులు దేపా భాస్కర్ రెడ్డి, బంగారి బాబు, రాణాప్రతాప్ రెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.