ETV Bharat / state

KTR: ఇంటింటికి నల్లా .. కేసీఆర్​ ఘనతే

author img

By

Published : Jul 1, 2021, 4:01 PM IST

ktr
కేటీఆర్​, సిరిసిల్ల

ఇంటింటికి నల్లా ఇచ్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజుపేటలో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. రాజుపేటలో రూ.20 లక్షలతో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 4వ విడత పల్లెప్రగతిలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే అని కేటీఆర్​ స్పష్టం చేశారు. రాజుపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాక ముందు 29 లక్షల మందికి పింఛన్లు వచ్చాయి, రాష్ట్రం వచ్చిన తర్వాత 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. 5వ తేదీ నుంచి కొత్త రేషన్​ కార్డులు ఇస్తున్నాం. రైతు బంధుతో ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నాం. రైతు బీమా కూడా అమలు చేస్తున్నాం. హరితహారంతో రోడ్లన్నీ పచ్చదనం పరుచుకున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థతి లేదు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్​, ట్రాలీ, ట్యాంకర్​ ఇచ్చాం. ఎండకాలం నర్మల చెరువు నిండటం ఇదే మొదటి సారి. కాళేశ్వరం ద్వారా నర్మల చెరువును నింపాం. ఈ ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుంది. నెలనెలా గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నాం.

-కేటీఆర్​, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

KTR: ఇంటింటికి నల్లా .. కేసీఆర్​ ఘనతే

ఇదీ చదవండి: Nagarjuna sagar: సాగర్‌లో ఏపీ అధికారులకు చుక్కెదురు.. విద్యుదుత్పత్తి కేంద్రంలోకి అనుమతి నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.