ETV Bharat / state

KTR Baddena Tour: 'దేశానికి అన్నదాతల శక్తి చాటేందుకే రైతు వేదికలు'

author img

By

Published : Feb 18, 2022, 1:18 PM IST

Updated : Feb 18, 2022, 2:19 PM IST

KTR Baddena Tour: సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు. దేశానికి అన్నదాతల శక్తి చాటేందుకే రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

KTR
KTR

KTR Baddena Tour: రైతులను సంఘంటితం చేసి.. దేశానికి అన్నదాతల శక్తిని చాటేందుకే రైతు వేదికలను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా 2వేల 603 రైతు వేదికలు నిర్మాణం చేసి అన్నదాతలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందేలా రైతు వేదికలు మేలు చేస్తాయన్నారు. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబీమా కల్పిస్తూ అన్నదాతల కుటుంబానికి ధీమా ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్​ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఓబులాపురంలో సమ్మక్క-సారలమ్మను మంత్రి కేటీఆర్‌ దర్శించుకున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతువేదికలు నిర్మిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 2,603 రైతువేదికలు నిర్మిస్తున్నాం. ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేశాం. కొత్త ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో 6 మీటర్ల పైకి భూగర్భ జలాలు వస్తున్నాయి. జీవిత బీమా, రైతు బంధు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. గోదావరి జలాలతో జిల్లా సస్యశ్యామలమయింది.

-- కేటీఆర్, మంత్రి

దేశానికి అన్నదాతల శక్తి చాటేందుకే రైతు వేదికలు

ఇదీ చూడండి: Harvard University invites KTR: హార్వర్డ్ సెమినార్​కు కేటీఆర్.. అందిన యూనివర్సిటీ ఆహ్వానం

Last Updated : Feb 18, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.