ETV Bharat / state

కేటీఆర్ పీఏ తిరుపతిపై ఆరోపణలు.. మంత్రి రియాక్షన్ ఇదే!

author img

By

Published : Mar 27, 2023, 5:40 PM IST

Updated : Mar 27, 2023, 7:39 PM IST

KTR
KTR

KTR on TSPSC paper Leak case: టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజ్‌ కేసులో తన పీఏ తిరుపతిపై వస్తోన్న ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాలు అమ్ముకున్నట్లు పీఏపై వచ్చిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

కేటీఆర్ పీఏ తిరుపతిపై ఆరోపణలు.. మంత్రి రియాక్షన్ ఇదే!

KTR on TSPSC paper Leak case: రాష్ట్రవ్యాప్తంగా టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు మంత్రి కేటీఆర్​, ఆయన పీఏ తిరుపతిపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లీకేజీకి తాను బాధ్యత వహించాలని, తన పీఏ తిరుపతి ఉన్నాడని.. పేపర్ అమ్ముకున్నాడని ఆధారాల్లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా?: పేపర్ లీకేజ్‌ కేసులో సీఎం బ్రోకర్ అని బండి సంజయ్‌ అన్నారని.. అదానీకి మోదీ బ్రోకర్ అని తాను చెప్పవచ్చని.. కానీ చెప్పనని కేటీఆర్ అన్నారు. జీవితంలో ఒక్కసారైనా సంజయ్, రేవంత్ పరీక్షలు రాశారా అని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి దొరికిపోలేదా అని నిలదీశారు. మల్యాల మండలంలో 415 మంది పరీక్షకు హాజరైతే.. 35 మంది మాత్రమే గ్రూప్‌-1 నుంచి అర్హత సాధించారని తెలిపారు. తిరుపతి స్వగ్రామంలో ముగ్గురు పరీక్ష రాస్తే.. ఒక్కరు కూడా అర్హత సాధించలేదని వివరించారు.

విపక్ష నేతలు ఇప్పుడేం చేస్తారు?: సిరిసిల్ల జిల్లాలో 3,250 మంది గ్రూప్‌-1 పరీక్ష రాశారని.. అందులో 255 మందికి 25 నుంచి 90 మార్కులు వచ్చాయని కేటీఆర్‌ తెలిపారు. జిల్లాలో ఒక్కరికి కూడా 100 మార్కులు రాలేదని పేర్కొన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అబద్దాలు ప్రచారం చేస్తున్న విపక్ష నేతలు ఇప్పుడేం చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

"రేవంత్‌రెడ్డి ఇప్పుడు నా పీఏ తిరుపతి వెంటపడ్డారు. నా పీఏ ప్రశ్నపత్రాలు అమ్ముకున్నట్లు ఆరోపిస్తున్నారు. మల్యాలలో 415 మంది పరీక్ష రాస్తే 35 మంది అర్హత సాధించారు. తిరుపతి సొంతూరులో ముగ్గురు రాస్తే ఒక్కరూ పాస్ కాలేదు. సంజయ్, రేవంత్ జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా?." -కేటీఆర్‌, మంత్రి

ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్​ కాన్వాయ్​ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. పేపర్​ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఈ కేసును హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ కాన్వాయ్​ ముందు బైఠాయించేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.
ఇవీ చదవండి: లాభాలు అదానీకి.. చందాలు మోదీకి.. నష్టాలు ప్రజలకు: కేటీఆర్

వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదు: కేటీఆర్

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కీలక నిర్ణయం.. కేంద్రం, గుజరాత్ సర్కార్​లకు నోటీసులు

Last Updated :Mar 27, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.