ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఎలా రావో చూద్దాం: మంత్రి కేటీఆర్

author img

By

Published : Mar 27, 2023, 5:14 PM IST

Updated : Mar 28, 2023, 11:24 AM IST

ktr
ktr

KTR Fires on Central Government: కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. అదానీ కోసం కేంద్రం ఎంతకైనా దిగజారిపోతుందని ఆరోపించారు. అదానీ కోసం మోదీ పాలసీ తీసుకువచ్చారని.. విమానాశ్రయాలు రాసి ఇస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్‌ ఛార్జీల ద్వారా ప్రజలపై భారం మోపేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోతో వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఎలా రావో చూద్దామని సిరిసిల్లలో కార్యకర్తలతో కేటీఆర్ అన్నారు.

లాభాలు అదానీకి.. చందాలు మోదీకి.. నష్టాలు ప్రజలకు: కేటీఆర్

KTR Fires on Central Government: కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. శ్రీకాంతాచారి బలిదానం గురించి తెలియనివారు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని ప్రధాని పార్లమెంటులో అన్నారని పేర్కొన్నారు. గుజరాతీల చెప్పులు మోసే వారు రాష్ట్రంలో పుట్టడం దురదృష్టమని అన్నారు. పీక్‌ అవర్‌లో విద్యుత్‌ ఛార్జీలు 20 శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించిందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పెరుగుతున్న అవసరాలకు సరిపడా బొగ్గు దేశంలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అదానీ కోసం ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకుంటారని ఆరోపించారు. విదేశీ బొగ్గును కొనుగోలు చేసి దేశానికి రప్పించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. తక్కువ ధరకు వచ్చే బొగ్గును వదిలిపెట్టి.. 10 రెట్లు విలువైన బొగ్గు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఈ కొనుగోలును యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యతిరేకించారని తెలిపారు.

KTR comments on Assemlby Elections 2023 :ప్రిల్‌ 27న పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవం జరగనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో అందరి అభిప్రాయాలను తీసుకుని వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో రూపొందిస్తామని స్పష్టం చేశారు. దీని ప్రకారం ముందుకు సాగితే వంద సీట్లు ఎలా రావో చూద్దామని మంత్రి కేటీఆర్ పార్టీ కార్యకర్తలతో అన్నారు.

అదానీ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు: బొగ్గు ధర పెరిగితే విద్యుత్‌ ఛార్జీలు పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు. విద్యుత్‌ ఛార్జీల ద్వారా ప్రజలపై భారం మోపేందుకు యత్నిస్తున్నారని వివరించారు. లాభాలు అదానీకి, చందాలు మోదీకి.. నష్టం ప్రజలకని వెల్లడించారు. అదానీ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారని ఆరోపించారు. అదానీ కోసం మోదీ పాలసీ తీసుకువచ్చారని.. విమానాశ్రయాలు రాసి ఇస్తున్నారని విమర్శించారు. ఒక సంస్థకు 2 విమానాశ్రయాల కంటే ఎక్కువ ఉండవద్దని గతంలో నిబంధన ఉందని.. అదానీ కోసం 6 విమానాశ్రయాలు రాసి ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు.

కేంద్రం ఏం సాధించిందని బండి సంజయ్‌ను అడగాలి: విద్యా వ్యవస్థలో సిరిసిల్ల ముందుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాది సిరిసిల్లకు వైద్య కళాశాల వస్తుందని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల, నవోదయ కళాశాల ఇవ్వలేదని ఆరోపించారు. యువతను బీజేపీ నాయకులు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లలో కేంద్రం ఏం సాధించిందని బండి సంజయ్‌ను అడగాలని అన్నారు. సిరిసిల్లకు వైద్య కళాశాల, ఇంజినీరింగ్‌, నర్సింగ్‌ కళాశాల తీసుకొచ్చామని కేటీఆర్ వివరించారు.

"అదానీ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. అదానీ కోసం మోదీ పాలసీ తీసుకువచ్చారు. అదానీ కోసం విమానాశ్రయాలు రాసి ఇస్తున్నారు ఒక సంస్థకు 2 విమానాశ్రయాల కంటే ఎక్కువ ఉండవద్దని గతంలో నిబంధన. అదానీ కోసం 6 విమానాశ్రయాలు రాసి ఇచ్చారు. బొగ్గు ధర పెరిగితే విద్యుత్‌ ఛార్జీలు పెరుగుతాయి. విద్యుత్‌ ఛార్జీల ద్వారా ప్రజలపై భారం మోపేందుకు యత్నం. లాభాలు అదానీకి, చందాలు మోదీకి.. నష్టం ప్రజలకు." -కేటీఆర్, మంత్రి

దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా: అంతకుముందు నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్​ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ గ్రామాలు అభివృద్ధికి చిరునామాగా మారాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వరుసగా మూడు సార్లు దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా నిలిచిందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి వల్లే ఈ పురస్కారాలు వస్తున్నాయని అన్నారు. మన గ్రామ పంచాయతీలు సాధించిన ప్రగతి.. ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో పాఠ్యాంశాలుగా బోధిస్తుండటం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్ వివరించారు.

గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1300 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులను విడుదల చేయకుండా.. వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. గతంలో ఉత్తమ గ్రామాలుగా గంగదేవిపల్లి, అంకాపూర్‌ మాత్రమే ఉండేవని.. ఇప్పుడు అనేక గ్రామాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయని వివరించారు. రూ.కోటి లోపు ఉన్న బకాయిలన్నీ వెంటనే విడుదల చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.

ఇవీ చదవండి: వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదు: కేటీఆర్

ఆగని ఆందోళనలు.. రాహుల్​కు మద్దతుగా నల్ల వస్త్రాలతో విపక్ష ఎంపీల నిరసన

Last Updated :Mar 28, 2023, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.