ETV Bharat / state

సిరిసిల్లలో ఘనంగా గంగపుత్ర దివస్ వేడుకలు

author img

By

Published : Nov 22, 2020, 7:17 PM IST

Updated : Nov 23, 2020, 2:21 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని గంగపుత్ర దివస్​గా నిర్వహించారు. అనంతరం గంగపుత్రులు సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్​లో ఉత్సవాలు జరుపుకున్నారు. గంగపుత్రుల పొట్టకొట్టే జీఓ నం. 6ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని గంగపుత్ర సంఘం అధ్యక్షులు డిమాండ్​ చేశారు.

gangaputhra diwas in rajanna sircilla
సిరిసిల్లలో ఘనంగా గంగపుత్ర దివస్ వేడుకలు

అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో 'గంగపుత్ర దివస్​'ను సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్​లో ఘనంగా నిర్వహించారు. గంగపుత్రుల పొట్టకొట్టే జీఓ నంబరు.6 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిరిసిల్ల గంగపుత్ర సంఘం అధ్యక్షులు కృష్ణహరి బెస్త డిమాండ్​ చేశారు.

ఇకపై ఏటా గంగపుత్ర దివస్ వేడుకలు..

ఇకపై ఏటా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని రాష్ట్రంలో గంగపుత్ర దివస్​గా నిర్వహిస్తామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఈ నెల 25 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు!

Last Updated : Nov 23, 2020, 2:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.