ETV Bharat / state

రాజన్న దర్శనం ప్రారంభం.. మాస్కు ఉంటేనే అనుమతి

author img

By

Published : Jun 8, 2020, 10:25 AM IST

Devotees at the Vemulavada Sri Rajarajeswaraswamy Temple
'మాస్కులు ధరించిన భక్తులకు మాత్రమే అనుమతి'

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. క్యూలైన్లలో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో కృష్ణారావు తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండున్నర నెలలుగా మూతపడిన ప్రార్థనా మందిరాలలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. లాక్​డౌన్ వల్ల మార్చి 20వ తేదీ నుంచి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు సడలించిన నేపథ్యంలో మళ్లీ దర్శనాలు ప్రారంభమయ్యాయి.

భౌతిక దూరం తప్పనిసరి

భక్తుల దర్శనం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో కృష్ణారావు తెలిపారు. ఆలయ ప్రవేశమార్గంలో చేతులు శుభ్రం చేసుకుంనేందుకు శానిటైజర్ కోసం ప్రత్యేకంగా టన్నెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మాస్కులు ధరించిన భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవో పేర్కొన్నారు.

భక్తులకు సూచనలు

  • ఆలయంలో ఆర్జిత సేవలు, కోడె మొక్కులు అభిషేకాలను నిషేధించారు.
  • గర్భగుడిలో సర్వదర్శనం మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
  • ఎలాంటి తీర్థప్రసాదాలను అందించడం లేదు.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు- మాస్కులతో భక్తులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.