ETV Bharat / state

ప్రకృతి ప్రేమికుడి కృషి.. చిగురించిన వటవృక్షం

author img

By

Published : Feb 13, 2022, 4:21 PM IST

Decades of Tree Translocated at Suddala, save tree
ప్రకృతి ప్రేమికుడి కృషి.. చిగురించిన వటవృక్షం

Decades of Tree Transplantation at Suddala : ప్రాణ వాయువును అందించే చెట్టు... ప్రకృతి విలయ తాండవానికి నేలకొరిగింది. ఏడు దశాబ్దాల క్రితం నాటిన ఈ వృక్షం... ఈదురు గాలుల బీభత్సానికి కుప్పకూలిపోయింది. దానిని నరికి వంట చెరుకుగా వాడుకుందామని అనుకున్నారు స్థానికులు. కానీ నీటిని పోసి... ఆ మర్రి చెట్టుకు ప్రాణం పోశారు ప్రకృతి ప్రేమికుడు ప్రకాశ్‌.

Decades of tree Tree Transplantation at Suddala : 70 ఏళ్ల కిందట నాటి మర్రి వృక్షం... ఈదురు గాలుల బీభత్సానికి కుప్పకూలింది. వంట చెరుకుగా మారే పరిస్థితి నుంచి... ఓ ప్రకృతి ప్రేమికుడి కృషితో.. మళ్లీ జీవం పోసుకుని... వట వృక్షంగా అవతరించనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు.. మర్రి వృక్షం వేర్లతో సహా పెకిలించుకుని పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ప్రకృతి ప్రేమికుడు, సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తున్న డాక్టర్ ప్రకాశ్... భూ యజమానులతో చర్చించి... 4 నెలలుగా క్రమం తప్పకుండా మర్రి మోడుకు నీటిని అందిస్తూ వచ్చారు. ఆయన కృషి ఫలించి వృక్షం చిగురించింది. దాన్ని ట్రాన్స్ ప్లాంటేషన్ విధానంతో సురక్షిత ప్రాంతానికి తరలించాలని భావించిన ప్రకాష్‌... రూ.50 వేలు ఖర్చు అవుతుందని దాతల సహకారం ఎదురు చూశారు.

ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌.. తనవంతు సహకారాన్ని అందించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో... వృక్షాన్ని వేరే చోటకు తరలించారు. భారీ సైజులో ఉన్న వృక్షాన్ని తరలించేందుకు క్రేన్లను ఉపయోగించారు. దీనిని 3 భాగాలుగా చేసి... రెండింటిని జిల్లాలోని జిల్లెల్ల అటవీ ప్రాంతంలోని రాముని బండ వద్ద నాటించారు. కాండాన్ని సిరిసిల్ల ఎస్పీ కార్యాలయం వద్దకు తరలించారు. అక్కడ ఆ చెట్టును నాటనున్నారు.

ప్రకృతి ప్రేమికుడి కృషి.. చిగురించిన వటవృక్షం

ఇదీ చదవండి: Farmers Innovative thinking: వాగు నీటిని ఒడిసిపట్టి.. రైతుల భగీరథ స్ఫూర్తి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.