ETV Bharat / state

ప్రైవేట్ ఉపాధ్యాయులకు కిరాణా సరకులు పంపిణీ చేసిన సేవక్ ఫౌండేషన్

author img

By

Published : Aug 1, 2020, 3:53 PM IST

ప్రైవేట్ ఉపాధ్యాయులకు కిరాణా సరకులు పంపిణీ చేసిన సేవక్ ఫౌండేషన్
ప్రైవేట్ ఉపాధ్యాయులకు కిరాణా సరకులు పంపిణీ చేసిన సేవక్ ఫౌండేషన్

పెద్దపల్లి జిల్లా మంథనిలోని సేవక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గత 5 నెలలుగా అనేక సేవా కార్యక్రమాలను, అన్నదాన కార్యక్రమాలను సంస్థ చేపడుతోంది. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో పేదవారికి, పారిశుద్ధ్య సిబ్బందికి, దినసరి కూలీలకు, బాటసారులకు సాయం అందిస్తూ సేవా భావాన్ని చాటుకుంటోంది.

మంథని మున్సిపల్ పట్టణ పరిధిలోని తమ్మ చెరువుకట్ట జానకిరామ కల్యాణ వేదిక ప్రాంగణంలో 45 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం సహా 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గత ఐదు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నందున నెల రోజులకు సరిపడా సామగ్రి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్ యాదవ్ చేతుల మీదుగా మాస్క్​లు, శానిటైజర్లు అందించారు.

వారి సేవలు అభినందనీయం...

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో సేవక్ ఫౌండేషన్ వివిధ సేవలు అందించడం అభినందనీయమని సీఐ మహేందర్ తెలిపారు. కొవిడ్ వైరస్ నియంత్రణకు ప్రజల్లో చైతన్యం కలిగించినందుకు సేవక్ ఫౌండేషన్ సభ్యులను పోలీసులు సన్మానించారు. సేవక్ ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ తన వంతు సహాయంగా రూ.5 వేలను సంస్థ ప్రతినిధి ముస్కుల లోకేందర్​కు అందించారు. మంచి కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు, సేవక్ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

దాతలు ముందుకు వస్తే మరిన్ని కార్యక్రమాలు...

ఆసక్తి గల దాతలు ఎవరైనా ముందుకు వస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కార్యక్రమంలో సేవక్ ఫౌండేషన్ అధ్యక్షుడు గట్టు శశి కుమార్, మేడగొని వెంకటేష్, ఎండీ ఖాజా మొయినుద్దీన్, మార్పాక శ్రవణ్, కైలాష్, రణధీర్, నితీష్, అక్షయ్, ఆదర్శ్, దత్తు, శశ్రిక్, మల్లికార్జున్, సాత్విక్, లోకేందర్ , ఉపాధ్యాయులు, సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : చికిత్సకు వచ్చి.. మెట్లపైనే ప్రాణాలు విడిచి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.