ETV Bharat / state

గోదావరిఖనిలో భక్తి శ్రద్ధలతో నిమజ్జన వేడుకలు

author img

By

Published : Sep 1, 2020, 6:57 AM IST

Immersion ceremonies with devotional zeal in Godavarikhani
గోదావరిఖనిలో భక్తి శ్రద్ధలతో నిమజ్జన వేడుకలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. పోలీసుల బందోబస్తు మధ్య గోదావరి నది వంతెన వద్ద గణనాథులను నిమజ్జనం చేశారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో వినాయక నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 9 రోజుల పాటు గణనాథునికి విశేష పూజలు నిర్వహించిన భక్తులు గోదావరిఖని గోదావరి నది వంతెన వద్ద నిమజ్జనం చేశారు.

ఈ క్రమంలో నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గోదావరిఖని రెండో పట్టణ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్​ పోలీసులు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే వినాయక చవితి ఉత్సవాలు.. కరోనా నేపథ్యంలో ఈసారి నిరాడంబరంగా జరిగాయి. ఎవరికి వారు తమ తమ ఇళ్లలో వినాయకులను ప్రతిష్టించుకుని పూజించుకున్నారు.

Immersion ceremonies with devotional zeal in Godavarikhani
నిమజ్జనం కోసం తీసుకొస్తూ..

ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.