ETV Bharat / state

అమిత్​షాను పార్లమెంట్​లోనే కలిశా: డీఎస్

author img

By

Published : Sep 26, 2019, 5:58 PM IST

రాజ్యసభ సభ్యుడి హోదాలోనే హోంమంత్రి అమిత్​షాను కలిశానని... భాజపాలో చేరే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీ డీ. శ్రీనివాస్​ స్పష్టం చేశారు. నిజామాబాద్​లో పర్యటించిన డీఎస్​ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెరాస పాలనపై తాను చెప్పేదేమి లేదని... ప్రజలు గమనిస్తున్నారన్నారు డీఎస్​.

RAJYASABHA MEMBER D.SRINIVAS ABOUT MEETING WITH CENTRAL HOME MINISTER AMITHSHA

కేవలం ఒక ఎంపీగానే అమిత్​షాను కలిశా: డీఎస్​

ఒక ఎంపీగా మాత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్​షాను కలిశానని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ నిజామాబాద్​లో స్పష్టం చేశారు. భాజపా కార్యాలయంలో అమిత్​షాను కలవలేదని పార్లమెంట్​లోనే కలిసినట్లు పేర్కొన్నారు. భాజపాలో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తన కొడుకు అరవింద్ సిద్ధాంతాలు వేరని వాటితో తనకు సంబంధం లేదనన్నారు. తప్పు చేస్తున్నట్లు తనపై ఆరోపణలు చేసిన తెరాస నేతలు చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి తాను చేయాల్సింది చేస్తానని చెప్పారు. తెరాస పాలనపై స్పందించేందుకు నిరాకరించిన డీఎస్​... ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప... ఆ తర్వాత జరిగిందేమి లేదని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం పట్టించుకోక పోవటం చాలా బాధాకరమని డీఎస్​ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: హుజూర్​నగర్ బరిలో 251 మంది సర్పంచ్​లు..

Intro:TG_NZB_04_26_MP_D.S_PC_AVB_TS10123 (. ) దేశానికి హోంమంత్రి కావడం వల్లే తాను ఒక ఎంపీ గా అమిత్ షా ను కలిశానని రాజ్యసభ సభ్యుడు డి .శ్రీనివాస్ పేర్కొన్నారు... బిజెపి పార్టీ ఆఫీస్ లో ఆయనను కలవలేదని పార్లమెంట్ లో కలిశా అని చెప్పారు... బిజెపిలో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు... తన కొడుకు అరవింద్ బీజేపీ నుంచి గెలిచాడు. అతని సిద్ధాంతాలు ఆయనవని వ్యాఖ్యానించారు ...తప్పు చేస్తున్నట్లు తనపై ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ నేతలు తనపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు... నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన డి.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు... జిల్లా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి తాను చేయాల్సింది చేస్తానని చెప్పారు ...టిఆర్ఎస్ పాలన పై స్పందించినందుకు నిరాకరించిన శ్రీనివాస్ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు... తాను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడే జిల్లాను అభివృద్ధి చేశాను తప్ప ఆ తర్వాత అభివృద్ధి శూన్యమని డి శ్రీనివాస్ పేర్కొన్నారు... తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోక పోవడం చాలా బాధాకరమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు....byte byte.... ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడు...


Body:ramakrishna


Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.