ETV Bharat / state

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురపాలికల్లో రగడ - ఛైర్మన్‌లకు అవిశ్వాసం సెగ

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 6:50 AM IST

Updated : Jan 4, 2024, 7:00 AM IST

Joint Nizamabad District Municipalities
Joint Nizamabad District Municipalities

Nizamabad Municipal Chairman No Confidence : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అవిశ్వాసానికి తెరలేచింది. ఇప్పటికే ఆర్మూర్ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై గురువారం రోజున అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేయనుండగా, త్వరలోనే కామారెడ్డిలో ఛైర్మన్‌పై కాంగ్రెస్, వైస్‌ ఛైర్మన్‌పై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టాలని యోచిస్తున్నాయి. మరికొన్ని మున్సిపాలిటీలు, సహకార సంఘాల్లోనూ అవిశ్వాసానికి సమయం అసన్నమైనట్టే కనిపిస్తోంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురపాలికల్లో రగడ

Nizamabad Municipal Chairman No Confidence : కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ గడ్డం‌ ఇందుప్రియపై అవిశ్వాసం (No Confidence Motion)పెట్టేందుకు బీఆర్ఎస్‌ నాయకులు పావులు కదుపుతున్నారు. ఓవైపు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అధికార పార్టీ కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. కామారెడ్డి మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ గులాబీ పార్టీ 23, హస్తం పార్టీ 12, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

No Confidence Motion in Kamareddy Municipality : స్వతంత్ర కౌన్సిలర్లు అందరూ బీఆర్ఎస్‌లో చేరడంతో మున్సిపల్ పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా నిట్టు జాహ్నవి, వైస్ ఛైర్మన్‌గా గడ్డం ఇందుప్రియలు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు, భారత్ రాష్ట్ర సమితి చేరడంతో మున్సిపల్‌లో ఆ పార్టీ బలం 39కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ హస్తం పార్టీలో చేరారు. అనంతరం మరో ఐదుగురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

పురపాలికల్లో రగడ.. ఛైర్మన్‌లపై అవిశ్వాసం నోటీసులు

No Confidence Motions in Telangana Municipalities : హస్తం పార్టీలోకి వెళ్లిన వైస్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు యోచిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమం అనంతరం, అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో మున్సిపల్‌లో విలీనమైన గ్రామాలకు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరికొందరిని తన పార్టీలో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నం చేస్తోంది. తద్వారా తమ బలం పెంచుకుని ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టి మున్సిపల్‌ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు.

No Confidence Motion in Armoor Municipality : ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipality) ఛైర్మన్‌ పండిత్ వినీతపై , ఈనెల 4న అవిశ్వాస తీర్మాన సమావేశం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ వెల్లడించారు. గత నెల 12న 26 మంది కౌన్సిలర్లు, ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు, కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. ఈనెల 4న జరగనున్న బల నిరూపణ తర్వాత వచ్చిన ఫలితాల మేరకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపడతారని ప్రసాద్ చౌహాన్ తెలిపారు.

"26 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు కలెక్టర్‌కు నోటీసులు అందించారు. ఆ వివరాలను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఈ నెల 4న అవిశ్వాస తీర్మానం ఉంటుంది. వీటిని పర్యవేక్షించేందుకు ఆర్డీఓని నియమించారు. 4న బలనిరూపణలో వచ్చిన మెజార్టీ వివరాలకు కలెక్టర్‌కు పంపిస్తాం. అందుకనుగుణంగా వారు చర్యలు తీసుకుంటారు." - ప్రసాద్ చౌహాన్‌, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

Opposition No Confidence Motion : విపక్షాలు వాకౌట్.. మూజువాణి ఓటుతో వీగిన 'అవిశ్వాసం'

మరోవైపు 13 నెలల పదవి కాలం ఉండడంతో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సహకారంతో బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు వన్నెల్దేవి లావణ్య, ఖాందేశ్ సంగీతలు ఛైర్మన్‌ సీటును ఆశీస్తున్నారు. అవిశ్వాసం నెగ్గాలనే సంకల్పంతో ఈ ఇద్దరు ఒక్కటై, తమకు మద్దతు ఉన్న కౌన్సిలర్లతో క్యాంప్ నిర్వహిస్తున్నారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా, అవిశ్వాస పరీక్ష కోసం నోటీసు ఇచ్చినప్పటి నుంచి మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త పవన్ తమకు మద్దతుగా ఉన్న ఎనిమిది మందితో క్యాంప్ నిర్వహిస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా మరో 20 మంది ఉన్నారు. ఇద్దరు కౌన్సిలర్లు ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. అయితే జనవరి 4న జరగనున్న అవిశ్వాస పరీక్షలో బీజేపీ కౌన్సిలర్లు ఎటువైపు ఉంటారనే ఆసక్తి నెలకొంది.

సర్కార్​ వద్దకు 'పురపాలికల్లో అవిశ్వాసం'.. నెక్ట్స్‌ ఏం జరగనుందో..?

మళ్లీ తెరపైకి పుర అవిశ్వాసాలు - గవర్నర్ ఆమోదం పొందని అవిశ్వాసాల సవరణ బిల్లు

Last Updated :Jan 4, 2024, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.